Breaking News

సీజేపీ ధర్నాలో ఆసక్తికర డిమాండ్‌, విద్యామంత్రిగా ఆయన?

Published on Sat, 06/06/2026 - 15:03

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల అనుమతి తరువాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ధర్నా విజయవంతంగా కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌తో ఆవిర్భవించిన 'కాక్రోచ్‌ జనతా పార్టీ' ఫౌండర్‌ అభిజీత్ దిప్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం,  విద్యా విధానంలోని లోపాల వల్ల మరణించిన విద్యార్థులకు  సీజేపీ ఘన నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థుల పేర్లను అభిజీత్ దిప్కే చదివి వినిపించారు. సామాజికకార్యకర్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.

ఈ నిరసనలో వినిపించిన డిమాండ్‌ మరిత విశేషంగా నిలిచింది. సోనమ్ తమ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని విద్యార్థులు కోరారు, అయితే  ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ఆయన  తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని న స్పష్టం చేశారు. యువత బాధ్యత తీసుకోవాలని అభిలషించారు. రాజకీయ నాయకులు మరియు ఉన్నతాధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోనమ్ వాంగ్‌చుక్ కోరారు. తనకు నిరసనలు చేయడం ఇష్టం  ఉందనీ, కానీ న్యాయం కోసం ఇలాంటి  తప్పవని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు రావాలని కూడా ఆయన పేర్కొన్నారు. 

కాగా ఈ నిరసనకు నాయకత్వం వహించేందుకు 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం ఉదయం అమెరికా నుండి ఢిల్లీకి చేరుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని విమానాశ్రయం నుండి బయటకు రావడం ఆయన అభిమానులను మరింత ఉత్సాహపర్చింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)