Breaking News

ఢిల్లీలో సీజేపీ నిరసనలు..

Published on Sat, 06/20/2026 - 10:59

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే నిరసనల్లో పాల్గొంటూ, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నీట్‌ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్సీ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనల సందర్భంగా భారీ ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు.  

ఇదిలా ఉండగా.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసనకు వందలాది మంది విద్యార్థులు, యువత హాజరయ్యారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

 

మరోవైపు.. సీజేపీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసి, పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకున్న సీజేపీ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)