Breaking News

2029లో మోదీ సర్కార్‌ ఓటమి తథ్యం 

Published on Sun, 11/08/2026 - 04:41

కొచ్చి: 2029 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కచ్చితంగా ఓడిపోతుందని కాక్రోచ్‌ జనతా పారీ్ట(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తేల్చిచెప్పారు. కేంద్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని అన్నారు. మార్పునకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)తోపాటు ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా శనివారం కేరళంలోని కొచ్చిలో నిర్వహించిన ‘జంతర్‌మంతర్‌ ఎట్‌ కొచ్చి’నిరసన కార్యక్రమంలో దీప్కే ప్రసంగించారు. ప్రభుత్వ మార్పు ఎన్నికల ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

దేశంలో స్వతంత్ర, నిష్పక్షపాత ఎన్నికల వ్యవస్థ ఉండాలని డిమాండ్‌ చేశారు. మోదీ అధికారంలో కొనసాగుతారని బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని, వాదనను ప్రస్తావించారు. ‘‘2029 కోసం సిద్ధంగా ఉండండి. మోదీ కచ్చితంగా దిగిపోతారు’’అని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగాలంటే జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని పునరుద్ఘాటించారు. ‘‘జ్ఞానేశ్‌ కుమార్‌ పదవి నుంచి తప్పుకోవాలి. ఆయన వెళ్తే, నరేంద్ర మోదీ కూడా వెళ్లిపోతారు’’అని స్పష్టంచేశారు. సీఈసీని కాపాడేందుకు మోదీ ప్రభుత్వం దేశంలోని యువతపైనే యుద్ధం చేస్తోందని దీప్కే మండిపడ్డారు. ప్రధానమంత్రికి జ్ఞానేశ్‌ కుమార్‌ ఎందుకు అంత ముఖ్యమైన వ్యక్తి అయ్యారని ప్రశ్నించారు.  

ఎన్ని అరెస్టులు చేసినా జాతీయ పతాకాన్ని వదలను 
కేంద్ర ప్రభుత్వం తనను ఎన్నిసార్లు అరెస్ట్‌ చేసినా సరే.. జాతీయ పతాకంతోనే దేశం మొత్తం పర్యటిస్తానని అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రజల ఆహార అలవాట్లు, వ్యక్తిగత సంబంధాలు, ఓటు హక్కులను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. దేశంలో స్వతంత్ర, నిష్పాక్షిక ఎలక్టోరల్‌ వ్యవస్థ ఏర్పాటయ్యేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు. 

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ప్రవేశించి జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు తనను, తన ఇద్దరు సోదరులు సౌరవ్‌దాస్, అశుతోష్‌ రాంకాలను అరెస్ట్‌ చేయడాన్ని ప్రస్తావిస్తూ... ఇకపై ఎక్కడికెళ్లినా త్రివర్ణ పతాకాన్ని తీసుకెళతానని ప్రకటించారు. ‘‘తివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు నేను జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సోదరులు సౌరవ్, అశుతోష్‌ కూడా ఈ కారణంగానే జైలుకు వెళ్లారు. ఇలాంటి ఘటన చివరిగా జరిగింది బ్రిటిష్‌ పాలనలోనే’’అని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని, బ్రిటిష్‌ పాలనను పోలుస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం వ్యక్తుల స్వేచ్ఛను నియంత్రించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

 ‘‘నరేంద్ర మోదీకి ఒక విషయం చెప్పదలచుకున్నా. ఎక్కడికెళ్లినా ఈ త్రివర్ణ పతాకాన్ని తీసుకువెళతా. దేశంలోని ప్రతిచోటకూ. కావాలంటే అరెస్ట్‌ చేసుకో. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళం లేదా తమిళనాడు ఎక్కడైనా అరెస్ట్‌ చేసుకో. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అరెస్ట్‌ చేసుకో. వెనక్కు వస్తా. మళ్లీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తా’’అని సవాలు విసిరారు. కేంద్రం క్రమేపీ ఏం తినాలో? ఎవర్ని పెళ్లి చేసుకోవాలో? ఎవరికి ఓటేయాలో కూడా నియంత్రించే దిశగా వెళుతోందని దీప్కే ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్‌)ను చేపట్టారని ఆరోపించారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)