ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్
Breaking News
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పోటీ
Published on Sun, 06/01/2025 - 12:13
పట్నా: ఈ ఏడాది(2025) బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్(Election Commission) కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల బీహార్(Bihar)లోని పట్నాలో జరిగిన ఎల్జేపీ కార్యవర్గ సమావేశంలో చిరాగ్ తాను బీహార్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయన పట్నా, దానాపూర్, హాజీపూర్లలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. దీనిపై చిరాగ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో చిరాగ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి, చురుకైన పాత్ర పోషించాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడైంది.
ఇది కూడా చదవండి: ‘నాన్నా.. ద్రోహం జరిగింది’: లాలూకు తేజ్ లేఖ
Tags : 1