Breaking News

భారత్‌ దిశగా చైనా గూఢచార నౌక

Published on Sat, 05/17/2025 - 05:34

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్‌ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్‌ యి హవో’ భారత్‌ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్‌ సిమోన్‌ అనే ఓపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్‌ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. 

శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్‌ చేయగలవు, సబ్‌మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్‌ విశ్లేషించారు.

 ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్‌ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది.

 గతేడాది ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్‌మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం.   

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)