Breaking News

ఢిల్లీ హోటల్లో హైడ్రామా సృష్టించిన జీ20 చైనా బృందం  

Published on Wed, 09/13/2023 - 12:03

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వైభవంగా జరిగిన జీ20 సమావేశాలకు దాదాపు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశాలు విజయవంతంగా ముగిశాక వారంతా తమతమ దేశాలకు తిరిగి పయనమయ్యారు. అయితే సమావేశాలు ముగిసిన మూడు రోజులకు ఢిల్లీ తాజ్‌లో జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీ20 సమావేశాల్లో హాజరయ్యేందుకు వచ్చిన చైనా ప్రతినిధుల బృందం బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలదీయగా బ్యాగులను స్కాన్ చేయడానికి నిరాకరించారు. భారత అధికారులు జోక్యం చేసుకున్నాక 12 గంటల పాటు సాగిన ఈ హైడ్రామాకు తెరపడింది.  

 

సమావేశాల సమయంలో చైనా ప్రతినిధుల బృందం తాజ్ ప్యాలెస్‌లో బస చేశారు. హోటల్ కు వస్తూనే వారి బ్యాగులను తనిఖీ చేయగా రెండు బ్యాగుల్లో అనుమానాస్పద పరికరాలు కనిపించడంతో వారిని అక్కడే నిలిపివేశారు తాజ్ సెక్యూరిటీ సిబ్బంది. ఆ రెండు బ్యాగులలో దౌత్య సంబంధమైన సామాన్లు ఉన్నట్లు చైనా బృందం వెల్లడించగా అనుమానమొచ్చి హోటల్ సెక్యూరిటీ బ్యాగులను స్కానర్ పై ఉంచాల్సిందిగా కోరారు. అందుకు వారు నిరాకరించడంతో 12 గంటలపాటు పెద్ద డ్రామా నడిచింది.

పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి అధికారులు కల్పించుకున్నాక వారి లగేజీని చైనా ఎంబసీకి తరలించడానికి వారు అంగీకరించడంతో హైడ్రామాకు తెరపడింది. భారత్‌లో జరిగిన ఈ సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైరుహాజరవ్వగా ఆయన స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా ప్రతినిధిగా హాజరయ్యారు. ఢిల్లీ తాజ్ హోటల్‌లో బస చేసిన చైనా ప్రతినిధి బృందానికి ఆయనే నాయకత్వం వహించారు.  

ఇది కూడా చదవండి: Libya Floods: లిబియాలో వరద బీభత్సం  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి