Breaking News

సైడ్‌ మిర్రర్‌ను తాకాడని..

Published on Thu, 10/30/2025 - 10:18

మెట్రో నగరం బెంగళూరులో మరో ఘాతుకం చోటు చేసుకుంది. తమ కారు సైడ్‌ మిర్రర్‌కు తాకిందని బైకర్‌తో గొడవపడి.. ఆపై ఆ యువకుడిని వెంటాడి కారుతో గుద్ది చంపారు ఇక్కడో జంట. ఈ షాకింగ్‌ ఘటనలో పోలీసులు వెల్లడించిన వివరాలు ఉన్నాయి. 

ఈ నెల 25న అర్ధరాత్రి దర్శన్‌ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఫుట్టనహెళిలోని శ్రీరామ లేఅవుట్‌ ప్రాంతంలో బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళుతున్న ఓ కారు సైడు మిర్రర్‌ను వీరి బైకు తాకింది. కారులో ఉన్న దంపతులు బైక్‌ నడుపుతున్న దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ. వెంబడించారు. వెనక నుంచి బైకును ఢీకొట్టి వెళ్లిపోయారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. దర్శన్‌ చనిపోగా.. వరుణ్‌ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేపీనగర పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్‌ తర్వాత కారు నుంచి విడిభాగాలు పడిపోతే ఆ జంట మాస్కులతో వెనక్కి వచ్చి మరీ వాటిని తీసుకెళ్లడం రికార్డైంది. ఈ క్రమంలో.. 

లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభ్యమైంది. నిందితులను భార్యాభర్తలైన మనోజ్, ఆరతిగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. విచారణలో తాము నేరానికి పాల్పడినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. తొలుత బైక్‌తో ఢీ కొట్టడానికి ప్రయత్నించగా.. వాళ్లు తప్పించుకున్నారని, ఆపై యూటర్న్‌ తీసుకుని మరోసారి వెంబడించి మరీ ఢీ కొట్టామని ఈ దంపతులు పోలీసులకు తెలిపారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)