Breaking News

ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతుంది.. కేంద్రం ప్రకటన

Published on Thu, 05/08/2025 - 11:18

ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్‌ సిందూర్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలియజేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక, వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.

అఖిలపక్ష సమావేశంలో భాగంగా రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అన్నారు. అనంతరం, కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ను అన్ని పార్టీలు సమర్థించాయి. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్‌ వివరాలు ఇవ్వలేం. పాకిస్తాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు’ అని చెప్పుకొచ్చారు.

పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట భారత్‌ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. ఈ భేటీకి ముందు ప్రధాని మోదీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను ప్రధానికి వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్ పై అఖిలపక్ష నేతలకు వివరిస్తున్న కేంద్రం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్‌, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)