Breaking News

సీబీఐ చేతికి.. మణిపూర్‌ మహిళలను ఊరేగించిన కేసు..!

Published on Thu, 07/27/2023 - 19:48

ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన‍్వేస్టిగేషన్‌(సీపీఐ)కి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. గత మూడు నెలలపాటు మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన పలు కేసులను రాష్ట్రం వెలుపల కూడా విచారణ జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మణిపూర్‌లో రెండు జాతుల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి.  గత మూడు నెలలుగా అల్లర్లలో అమానవీయ ఘటనలు ఎన్నో జరిగాయి. మహిళలపై అత్యాచారాలు, లూఠీలు, దొంగతనాలు, సహా దారిదోపిడీల వరకు అనేక కేసులు పలు పోలీసు స్టేషన్‌లలో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అల్లర్లలో ఆందోళనకారులు దేశమంతా తలదించుకునే సంఘటన మే 3న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకొచ్చింది. ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. అటు రాజకీయంగా కూడా దుమారాన్ని రేపింది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిందించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే మణిపూర్ ఈ దుస్థితికి చేరిందని ఆరోపించాయి. పార్లమెంట్‌ సమావేశాల్లోనూ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని పట్టుబడుతున్నాయి. గత వారం రోజులుగా ఈ అంశంపైనే పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదా పడుతూ వస్తున్నాయి.  

ఇదీ చదవండి: కెమెరా సాక్షిగా మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి..

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు