Breaking News

పెళ్లిలో సెలబ్రిటీ ఫైరింగ్‌ : ఐదేళ్ల బాలుడు మృతి

Published on Tue, 11/03/2026 - 18:07

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ జిల్లాలో పెళ్లి వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. వివాహ ఊరేగింపుకు ముందు జరిపిన  సంబరాల కాల్పుల్లో ఐదేళ్ల బాలుడు మృతి  చెందిన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటన ఆదివారం రాత్రి ఫుటెహరి బాంకే గ్రామంలో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం, కడిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుతెహరి గ్రామానికి చెందిన ఘనశ్యామ్‌ పటేల్‌ ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లి ఊరేగింపు బయలుదేరడానికి కొద్దిసేపటి ముందు, బాలుడి బంధువు అయిన అజయ్‌ అనే వ్యక్తి తన లైసెన్స్‌ కలిగిన తుపాకీతో అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపాడు.  దీంతో ఆ బుల్లెట్‌ అక్కడ నిలబడి ఉన్న అర్ష్ పటేల్‌ పటేల్‌ (5) పొత్తికడుపులోకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావమైన బాలుడిని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కలిసి వెంటనే కాదిపూర్‌ ఆరోగ్య కేంద్రానికి, అనంతరం సుల్తాన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇదీ చదవండి: 20 అడుగుల ముత్యాల హనుమాన్‌ : దీపావళి వేళ అద్భుతం
 

బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. దర్యాప్తు జరుగుతోందని, సర్కిల్ ఆఫీసర్ వినయ్ గౌతమ్ తెలిపారు. కాగా గతేడాది 2025 ఫిబ్రవరిలోనూ నోయిడాలో పెళ్లి ఊరేగింపు కాల్పుల వల్లే బాల్కనీలో నిలబడి వేడుక చూస్తున్న రెండేళ్ల బాలుడు మరణించిన సంగతి విదితమే. 

ఇదీ చదవండి: ఫస్ట్ ఏసీలోనే నగలు,నగదు చోరీ మహిళ ఆగ్రహం : స్పందించిన రైల్వే

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)