ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం

Published on Wed, 05/14/2025 - 15:42

న్యూఢిల్లీ:  ఆపరేషన్ సిందూర్ లో భాగంగా  న్యూఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హైలెవిల్ సీసీఎస్ సమావేశం జరిగింది.  పలువురు కీలక కేబినెట్‌ మంత్రులతో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షాలు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ తో పాక్ లోని ఉగ్రస్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే వరుసగా సీసీఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ.

గత 20 రోజుల్లో సీసీఎస్ భేటీ కావడం ఇది ఐదోసారి. అయితే భారత్‌-పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపిన తర్వాత సీసీఎస్‌తో ప్రధాని మోదీ భేటీ కావడం తొలిసారి.  ఈ సందర్భంగా ప్రధాని మోదీని కేబినెట్ ప్రశంసించింది. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పారని మోదీని అభినందించింది. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని కేబినెట్ కొనియాడింది.

కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి  దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో  పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో  తన సత్తా ఏమిటో చూపెట్టింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)