మోదీపై అభ్యంతకర పోస్టర్‌.. నటిపై ఫిర్యాదులు

Published on Mon, 07/27/2026 - 02:30

కోల్‌కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది.  కోల్‌కతాలో ఇటీవల  జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.

నిన్న (ఆదివారం) ఆనంద్‌పూర్ పోలీసు స్టేషన్‌లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్‌నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.

నిరసన ప్రదర్శన నేపథ్యం
NEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.

అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)