Breaking News

ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భేటీ

Published on Fri, 09/11/2026 - 15:47

ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్‌ సదస్సుకు హాజరయ్యారు. భారత్‌ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్‌ భేటీ అయ్యారు. భారత్‌, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్‌ఎన్‌జీ దిగుమతి, అధునాతన యుద్ధ విమానాల తయారీ సాంకేతికత బదిలీ తదితర అంశాలపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యారు.

 

పుతిన్‌కు మోదీ కానుక
ద్వైపాక్షిక భేటీలో పుతిన్‌కు రష్యన్‌ భాషలో అనువదించిన ఓ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందించారు. తమిళ కవి తిరువళ్లువరు రచించిన ‘తిరుక్కురళ్’ పుస్తకాన్ని అందజేశారు. పుతిన్‌ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, బ్రిక్స్‌ సదస్సుకు షీ జిన్‌పింగ్‌ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది.

జిన్‌పింగ్‌ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్‌–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్‌ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్‌ చేశారు.

ఇదీ చదవండి:
బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్‌..!

 


 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)