Breaking News

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ

Published on Sat, 09/12/2026 - 18:33

ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. సరిహద్దు వివాదాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్‌.. భారత్‌తో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరమన్నారు. అభివృద్ధి అంశాలపైన కలిసి పని చేయాలని.. తరచుగా సమావేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ శాంతికి భారత్ చైనా సంబంధాల బలోపేతం అవసరం. ఇండియా, చైనా దీర్ఘకాలిక సంబంధాలపైన దృష్టి సారించాలి. ప్రపంచశాంతికి భారత్‌- చైనా సంబంధాల బలోపేతం అవసరం. మన దేశాల బలబలలు అందరికీ తెలుసునని జిన్‌పింగ్‌ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమన్నారు. విస్తృతమైన అంశాల పైన ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న మోదీ.. బ్రిక్స్ అధ్యక్షతకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తొలి రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగిసింది. ఢిల్లీ డిక్లరేషన్‌ను “బ్రిక్స్” శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది. శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు సంయుక్త ప్రకటన చేశాయి. యుద్ధాలు, ఘర్షణలు, సమస్యల మూలాలను పరిష్కరించాలన్న బ్రిక్స్‌ దేశాలు.. ఏకపక్షంగా సుంకాల విధింపు పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని బ్రిక్స్ దేశాల కూటమి పిలుపునిచ్చాయి.

ఇదీ చదవండి: భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?



 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)