Breaking News

లాస్ట్‌ మినిట్‌లో సెలవు రద్దు, జెన్‌ జెడ్‌ స్పందన వైరల్‌

Published on Thu, 02/26/2026 - 12:38

చివరి క్షణంలో బాస్ సెలవు రద్దు చేయడంతో ఒక యువతి  స్పందించిన తీరు నెట్టింట్‌ చర్చకు దారి తీసింది.  తన జర్నీ ప్లాన్స్‌ గురించి ముందుగానే చెప్పినా, సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా సెలవు రద్దు చేశాడట మేనేజర్‌. దీనికి సంబంధించి జెన్‌జెడ్‌ యువతి ఒక వీడియోను సోషల్‌ మీడియాల  పోస్ట్‌  చేయడంతో ఇది  వైరల్‌గా మారింది. 

సిమ్రాన్ షేర్‌ చేసిన వివరాల ప్రకారం తాను సెలవు మీద వెళ్లాలనుకుంటున్నట్టు కొన్ని వారాల ముందుగానే  మేనేజర్‌కు తెలిపింది. ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం లేవనెత్తలేదు. కానీ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి సిద్ధమవు తున్నప్పుడు,  అత్యవసర విస్తరణ అవసరం కారణంగా ఆమె సెలవు రద్దు చేసినట్టు సమాచారం ఇచ్చాడు మేనేజర్‌. దీంతో షాకైన ఆమె   "ఐ డోంట్ కేర్"  అని సమాధాన మిచ్చిందట. 

కార్యాలయంలో అత్యవసర పరిస్థితులు సంభవించవచ్చు, కానీ పర్సనల్‌  కమిట్‌మెంట్స్‌ను పదేపదే  దెబ్బతీసేలా ఉండకూడదు కదా సిమ్రాన్  తెలిపారు.  ఉద్యోగాన్ని శ్రద్దగా చేస్తాను. అలాగే తన జీవితాన్ని, ప్రయాణాన్ని ఆస్వాదిస్తాను. కానీ ఉద్యోగులు చివరి నిమిషంలో డిమాండ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని  పేర్కొంది.

నెటిజనుల స్పందన
ఈ వీడియో త్వరగా ఆన్‌లైన్‌లో దృష్టిని, మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఆమె వైఖరికి మద్దతు ఇచ్చారు. వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌పై తీవ్ర చర్చ సాగింది. ఈ సంఘటన ఆమెను నిరాశకు గురిచేసిదని,ఇది కమ్యూనికేషన్ వైఫల్యంగా కొందరు పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల వ్యక్తిగత సమయం పట్ల గౌరవం లేకపోవడానికి నిదర్శమని కొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ సరైన బ్యాకప్‌ను ఏర్పాటు  చేసుకొని, లీవ్‌ సంగతి స్పష్టంగా తెలియజేయాలని మరికొందరు పేర్కొన్నారు.

అయితే, మరికొందరు సెలవు అధికారికంగా  ఆమెదించారా? లేదా  అని ప్రశ్నించగా, ఇలాంటి ప్రయాణాలప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ఉద్యోగిపై ఉందని ఒకరన్నారు. మొత్తం మీద ఈ వీడియో ఆఫీసు, అధికారుల ప్రవర్తనా తీరు,  ఉద్యోగుల వృత్తిపరమైన జవాబుదారీతనం చుట్టూ పెరుగుతున్న ఆందోళనలను హైలైట్  చేసింది. 

ఇదీ చదవండి: ప్రెగ్నెంట్‌ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)