ఆ మూడు రాష్ట్రాలపై బీజేపీ నజర్‌.. నూతన నియామకాలతో ఎన్నికల వ్యూహం

Published on Thu, 09/25/2025 - 17:49

న్యూఢిల్లీ: బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో రాబోయే ఎన్నికలకు పోల్ ఇన్‌చార్జ్‌లను నియమించడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహాత్మక ముందడుగు వేసింది. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ నియామకాలు కీలక రాష్ట్రాలలో ప్రచార యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి  ఉపయుక్తమవుతాయని పార్టీ భావిస్తోంది.

బీహార్‌లో ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడులో బైజయంత్ పాండా పశ్చిమ బెంగాల్‌లో భూపేంద్ర యాదవ్ పోల్ ఇన్‌చార్జ్‌లుగా నియమితులయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు సీఆర్ పాటిల్, కేశవ్ ప్రసాద్ మౌర్య సహ ఇన్‌చార్జ్‌లుగా పనిచేయనున్నారు. ఈ బృందం పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, కార్యకర్తలను సమీకరించడం, రాష్ట్రంలో బలమైన బీజేపీ ఉనికిని చాటేందుకు వ్యూహాలను అమలు చేయడం తదితర బాధ్యతలను చేపడుతుంది. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను బైజయంత్ పాండాకు అప్పగించారు. మురళీధర్ మోహోల్ అతనికి సహ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు.

పశ్చిమ బెంగాల్‌కు పోల్ ఇన్‌చార్జ్‌గా భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. బిప్లాబ్ కుమార్ దేబ్ ఆయనకు సహ ఇన్‌చార్జ్‌గా మద్దతునిస్తున్నారు. వారి ఉమ్మడి నాయకత్వం రాష్ట్రంలో బీజేపీ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని పార్టీ భావిస్తోంది. అనుభవజ్ఞులైన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ప్రచార నిర్వహణ, ఓటర్ల సమీకరణకు సమన్వయ విధానాన్ని రూపొందించనుంది. ఈ నూతన నియామకాలు బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నాయి. ప్రణాళికాబద్ధమైన వ్యూహాలను అమలు చేసే దిశగా పార్టీలోని సీనియర్‌ నేతల సలహా, సంప్రదింపులను బీజేపీ తీసుకుంటున్నదని సమాచారం.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)