Breaking News

బీహార్‌ ఎలక్షన్స్‌: ‘భారతంలో దృతరాష్ట్రుడిలా..’

Published on Wed, 10/08/2025 - 12:59

విమర్శల.. ప్రతివిమర్శలతో.. బీహార్‌ రాజకీయం నెమ్మదిగా  వేడెక్కడం మొదలైంది. ఈ క్రమంలో బీహార్‌ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్‌ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ధృతరాష్ట్రుడితో(Lalu As Dhritarashtra) పోల్చడంపై దుమారం రేగింది.

ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పులను క్షమించినట్లే, లాలూ ప్రసాద్ కూడా తన కుమారుల తప్పులను సమర్థిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ విజయ్‌ సిన్హా(Vijay Sinha Slams Lalu) వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ.. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. ఆయన రాజకీయాల్లో తన ఉనికిని చాటేందుకు బీహార్‌ను అపహాస్యం చేస్తూ, ఇష్టమైనట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విజయ్‌ సిన్హా విమర్శలు గుప్పించారు. 

ఈ విమర్శలపై  ఆర్జేడీ స్పందించింది(RJD Reacts on Dhritarashtra Comment). విజయ్‌ సిన్హా వ్యక్తిగత దాడితో దిగజారిపోయారంటూ మండిపడింది. అయితే లాలూను విజయ్‌ దృతరాష్ట్రుడిగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు. 

బీహార్‌లో విజయం కోరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరిశ్రమలను మాత్రం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారంటూ లాలూ ఓ విమర్శ చేశారు. దానికి ఘాటుగా స్పందించే క్రమంలో విజయ్‌ సిన్హా మాట్లాడుతూ.. బీహార్‌ను నాశనం చేసిన వాళ్లు, ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేలా చేసిన వాళ్లు జీవిత చరమాంకంలో ఉన్నారు. అలాంటి వాళ్లు తన కొడుకులపై గుడ్డి ప్రేమతో.. మళ్లీ బీహార్‌లో అలజడిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే ఈసారి బీహార్‌ ప్రజలు అలాంటి చర్యలను సహించబోరు అని విజయ్‌ సిన్హా అన్నారు. 

ఇదీ చదవండి: అతని స్టామినా ఏంటో బీజేపీకి తెలుసు.. అందుకే బుజ్జగింపు!

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)