Breaking News

Pahalgam Attack Probe: ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి అరెస్ట్‌

Published on Wed, 09/24/2025 - 19:38

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ పరిధిలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలచివేసింది.

ఈ ఘటనపై దర్యాప్తు సంస్థల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా కార్యకర్తను తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర సామగ్రిని విశ్లేషించిన దరిమిలా ఇతని అరెస్టు జరిగింది. ఉగ్రవాదుల కదలికను సులభతరం చేయడంలో  ఇతను కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు.

నిందితుడిని కుల్గాం జిల్లాకు చెందిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాగా పోలీసులు గుర్తించారు. అతను టీచర్‌గా పనిచేస్తున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి.  అతని సహచరులను గుర్తించేందుకు, సంబందిత నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)