Breaking News

నా భర్త అశ్లీల వీడియోలు చూస్తూ.. నరకం చూపిస్తున్నాడు..!

Published on Wed, 12/31/2025 - 07:33

బెంగళూరు: భర్త విచిత్ర ప్రవర్తన, లైంగిక వేధింపులతో మనస్తాపం చెందిన భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలు.. భార్యాభర్తలిద్దరూ ఒకే కంపెనీలో సహోద్యోగులు. హెచ్‌ఆర్‌గా ఉన్నప్పుడే ఇద్దరికీ పరిచయమై అనంతరం ప్రేమకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులను ఒప్పించిన అనంతరం 2025 సెపె్టంబరు 3 తేదీన కుటుంబ సభ్యులు చింతామణిలో మంజునాథ్‌తో వివాహం జరిపించారు.

వివాహమైన అనంతరం భర్త సైకోలా ప్రవర్తిస్తుండగా ఫోన్‌ చూసి లైంగిక ప్రక్రియకు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంట్లో వారి ముందు నగ్నంగా తిరుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది. ప్రస్తుతం సైకో భర్త వేధింపులకు భార్య హడలిపోయింది. నేను వివాహం చేసుకుంది ఇలాంటి సైకో వ్యక్తినా అని మదనపడుతోంది. వివాహమైన కొద్దిరోజుల పాటు అన్యోన్యంగా ఉన్న భర్త ప్రస్తుతం సైకోలా ప్రవర్తిస్తుండటంతో భార్య బెంబేలెత్తిపోతోంది. 

అత్తమామల ముందు కూడా నగ్నంగా  సంచరిస్తుండటంతో పాటు ప్యాసేజ్‌లోకి వెళ్లి చుట్టుపక్కల వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. భర్త విచిత్ర ప్రవర్తన, వేధింపులతో పాటు తనను భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ, శారీరకంగా, మానసికంగా హింసించాడని, తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యంగా దూషించి దాడికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తనకు అతని తల్లిదండ్రులు మద్దతు ఇస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. కేంద్ర విభాగం మహిళా స్టేషన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)