Breaking News

లైట్‌ ఆర్పనందుకు మేనేజర్నే చంపేశాడు!

Published on Mon, 11/03/2025 - 15:12

బెంగళూరు : మనుషుల్లో అంతకంతకూ వివేచన, విచక్షణ జ్ఞానం అనేది అంతకంతకూ నశించిపోతోంది. స్వల్ప వివాదానికే ఆవేశంతో ఊగిపోతున్నారు. చివరకు హత్యలకు కూడా తెగబడుతున్నారు.  తాజాగా బెంగళూరులో జరిగిన ఒక హత్యోందంతం దిగ్భ్రాంతి రేపక మానదు.

ఆఫీసులో లైట్లు ఆర్పే విషయంలో ఏర్పడిన చిన్న తగాదా హత్యకు దారి తీసింది. చిత్రదుర్గకు చెందిన భీమేష్ బాబు అనే 41 ఏళ్ల మేనేజర్‌ను అతని సహోద్యోగి డంబెల్‌తో కొట్టి చంపాడు. శనివారం తెల్లవారుజామున గోవిందరాజనగర్ పోలీస్ పరిధిలోని డేటా డిజిటల్ బ్యాంక్ కార్యాలయంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.  తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో, విజయవాడకు చెందిన టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ (24)ని లైట్లు ఆర్పేయమని తన మేనేజర్‌ భీమేష్‌ను కోరాడు. లైట్లు, వెలుగులు పడని వంశీ అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయమని సహోద్యోగులను తరచుగా కోరుతూ ఉంటాడట. అదే విధంగా భీమేష్‌ను కూడా లైటు ఆఫ్‌ చేయమని కోరాడు.  భీమేష్‌ వినకపోవడంతో అది వాగ్వాదానికి తీసింది. కోపంతో ఊగిపోయిన  వంశీ బాబుపై కారం పొడి విసిరి, తల, ముఖం, ఛాతీపై డంబెల్‌తో పదేపదే కొట్టడంతో అతను కుప్పకూలి పోయాడు. ఆ తరువాత వంశీ భయాందోళనకు గురై ఇతర ఉద్యోగుల సహాయం కోరాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కానీ బాబు అక్కడికక్కడే మరణించాడు.   

చదవండి: నీతా అంబానీకి స్టాఫ్‌ సర్‌ప్రైజ్‌ : భర్త, తల్లి కాళ్లు మొక్కి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చూశారా?
 

ఆ తరువాత  వంశీ స్వయంగా గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్య కేసు నమోదు చేయబడింది. ఆఫీసు లైట్లు వెలిగించాలనే వివాదం హత్యకు దారితీసిందని డిసిపి (వెస్ట్) గిరీష్ ఎస్ ధృవీకరించారు.

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)