Breaking News

రౌడీషీటర్ బర్త్‌డే పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే సందడి

Published on Mon, 07/13/2026 - 13:55

బెంగళూరు: తమిళనాడులోని బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ దాసా అలియాస్ ‘కింగ్ మేకర్ దాసా’ పుట్టినరోజు వేడుకల్లో యలహంక బీజేపీ శాసనసభ్యుడు ఎస్ఆర్ విశ్వనాథ్ పాల్గొనడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. నెలకుంట్ల పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ వీడియోలో రౌడీషీటర్ దాసా కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యే విశ్వనాథ్ ఆయనకు పూలమాల వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యేతో పాటు పలువురు స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ సంబరాల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే ఈ వేడుకల సమయంలో పోలీసులెవ్వరూ అక్కడ లేకపోవడం గమనార్హం.

చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా నమోదైన దాసాపై యలహంక, నెలమంగళ, దాసరహళ్లి ప్రాంతాల్లో భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది కూడా దాసా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ఒక బెంగళూరు పోలీసు ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఏడాది ప్రజాప్రతినిధి స్వయంగా రౌడీషీటర్ వేడుకల్లో పాల్గొనడంపై నెటిజన్లు, విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మాదానాయకనహళ్లి పోలీసులు స్పందిస్తూ.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి: గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు!

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)