గాడిద చాకిరీ తప్ప ఏం లేదు..గిగ్‌ వర్కర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

Published on Fri, 01/30/2026 - 14:56

బెంగళూరుకు చెందిన ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన పోస్ట్, గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక శారీరక వెతల గురించి  చెప్పకనే చెబుతుంది.అతని పోస్ట్‌లోని వివరాల ప్రకారం క్యాబ్‌ డ్రైవర్‌గా తాను గాడిద చాకిరీ చేస్తున్నా సంతృప్తికర జీవితం గడపలేకపోతున్నానని వాపోయాడు.  

వ్యాపారంలో నష్టపోయిన కారణంగా అప్పులు మిగిలాయి. దీంతో అందుకే  ఖర్చుల నిమిత్తం యల్లో బోర్డు క్యాబ్‌ను అద్దెకు తీసుకుని, ఊబర్ . రాపిడోతో పనిచేయడం ప్రారంభించాడు. ప్రతిరోజూ దాదాపు 16 గంటలు డ్రైవ్ చేస్తాను.  సుమారు 4 వేల రూపాయలు సంపాదిస్తాడు. అందులో 1.5 వేలు కారు అద్దెకు, 1.2 వేలు సీఎన్‌జీకి ,  ఫుడ్‌, వాటర్‌ కోసం 200 రూపాయలు ఖర్చవుతాయి.  ఇక తనకు మిగిలిని రోజుకు దాదాపు 1000 రూపాయలు మిగులుతాయి. ఇలా బతకడం చాలా  కష్టంగా  ఉందని  చెప్పుకొచ్చాడు.

తనకు వచ్చే రాబడి పరిస్థితి ఇలా ఉంటే, శారీరక శ్రమ మరింత దారుణంగా ఉంటుందని తెలిపాడు. కాళ్లు నొప్పులు..  ఇక  చాలు బాబోయ్‌.. అని మోకాళ్లు  మొరాయిస్తుంటాయి. రోజులో కేవలం 6 గంటల నిద్ర.  ఇక తనకు సమయం మిగిలడంలేదనీ, అందుకే సోషల్‌మీడియాలో మధ్య ఏ సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉండటంలేదని చెప్పాడు.  ఇక ఇంధన కోసం పొడవైన క్యూలలో వేచి ఉండాలి.. అసలు ఇది ఒక జీవితమేనా? అనిపిస్తుంటుంది. తమ లాంటి డ్రైవర్లు తాము పనిచేసే యాప్‌ల నుండి నిరంతర ఒత్తిడి గురించి  ఎంత చెప్పినా తక్కువే,   అందుకే దీన్ని'గాడిద చాకిరీ'  అంటాం. “యాప్ 'ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్' లాగా పనిచేస్తుంది. వచ్చిన రైడ్‌ను  త్వరగా, అంటే 5-6 సెకన్లలో అంగీకరించకపోతే, మరొకరు తీసుకుంటారు.  రైడ్‌లనువెంటనే యాక్సెప్ట్‌ చేయకపోతే రేటింగ్‌ పడిపోతుంది అని  వివరించాడు.  

ఇదీ చదవండి: స్టార్‌ సింగర్‌ రిటైర్మెంట్‌ వెనుక రహస్యం ఇదేనట!

ట్రాఫిక్‌లో నానా కష్టాలుపడి ఇంటికి రాగానే, ఎంత అలిసిపోయినా కారు కడగాల్సిందే. ఇంతక చేసినా తమ  కష్టానికి ఏమీ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వేలాదిమంది ఉద్యోగాల వాస్తవికత ఇదే. అయితే దోపిడీ చేసేవాడు.. లేదా దోపిడీకి గురయ్యేవారు.  లేదా దోపిడీ చేసేవాడిగా ఉండాలి లేదా దోపిడీకి గురయ్యేవాడిగా ఉండాలి.చౌక శ్రమ వల్లే ఇతరులు ఈ సౌకర్యాలను అనుభవించగలుగుతున్నారు అని  పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్  కావడంతో నెటిజన్లు అతనిపై సానుభూతిని  ప్రకటించారు. ఏమీ చేయలేని పరిస్తితిలో ఉన్నాం. మీ ప్రతి మాటలో మీ మానసిక,శారీరక బాధను రెండూ అర్థం చేసుకోగలం అంటూ సానుభూతి  వ్యక్తంచేశారు. అన్నీ సర్దుకుంటాయి. ధైర్యంగా ఉండండి అని  మరికొందరు చెప్పారు.  చాలామంది గిగ్ కార్మికులను గౌరవించాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)