పాపం.. ఫుట్‌బాల్‌లా తన్నాడు..వైరల్‌ వీడియో

Published on Fri, 12/19/2025 - 17:34

బెంగళూరులో జరిగిన అనూహ్య సంఘటన  ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. తల్లితో కలిసి ఆడుకుంటున్న పిల్లవాడిని ఒక వ్యక్తి అమాంతం తోసి వేసిన ఘటన నెట్టింట దిగ్భ్రాంతి రేపుతోంది.  దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వీడియో  వైరల్‌గా మారింది.

డిసెంబర్ 14న ఆ బాలుడు నీవ్ జైన్ తన అమ్మమ్మ ఇంటి దగ్గర ఇతర పిల్లలతో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగింది.  త్యాగరాజనగర్ ప్రాంతంలోని ఒక వీధిలో   ఐదేళ్ల బాలుడు తోటిపిల్లలతో ఆటుకుంటున్నాడు. తల్లి కూడా అక్కడే ఉంది. ఇంతలో వెనకనుంచి వ్యక్తి ఆ బాలుడిని గట్టిగా కాలితో తన్నాడు. ఊహించని పరిణామానికి బాలుడు బొక్కబోర్లా పడిపోయాడు.

 ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది. బాలుడి తల్లి దీపిక జైన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నిందితుడిని అరెస్ట్‌ చేశారు. తరువాత బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.తదుపరి దర్యాప్తు జరుగుతోంది.  తన కొడుకును "ఫుట్‌బాల్ లా" తన్నాడని, దీంతో కనుబొమ్మల వద్ద గాయం రక్త స్రావమైందని, కాళ్లు, చేతులకు కూడాగాయాలైనాయని తల్లి ఆరోపించింది. మరోవైపు నిందితుడిని అదే ప్రాంతానికి  చెందిన రంజిత్‌గా గుర్తించారు. ఇతను మాజీ జిమ్ ట్రైనర్ కూడా అట. ఉద్యోగాన్ని వదిలేసినట్టు సమాచారం.  నిందితుడు ఈ ప్రాంతంలో ప్రజలపై దాడి చేయడం,  దుర్భాషలాడడం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటాడట.

ఇవీ చదవండి:  ట్వీట్స్‌తో మోత మోగించిన ప్రధాని మోదీ
బెట్టింగ్‌ యాప్స్‌ : యూట్యూబర్‌ హై-ఎండ్ స్పోర్ట్స్ కార్లు చూసి ఈడీ షాక్‌!



 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)