Breaking News

ఖాళీగా ఓలా.. అయినా ఉబర్‌ కోసం అరగంట వెయిటింగ్‌!

Published on Fri, 06/19/2026 - 09:10

ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్‌ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

బెంగళూరుకు చెందిన ఆకాశ్‌ కొటాల్వార్‌ అనే వ్యక్తి తన లింక్డ్‌ఇన్‌ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-2లో దిగిన తర్వాత ఉబర్‌ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్‌ వద్ద క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. 

ఆకాశ్‌ కూడా ఉబర్‌ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్‌లోనే ఖరీదైన ‘ఉబర్‌ కంఫర్ట్‌’ సేవను ఎంచుకున్నానని ఆకాష్‌ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు.

కారణం ఏంటంటే.. 
ఇది బ్రాండ్‌ లాయల్టీ (బ్రాండ్‌పై అభిమానం) కంటే "స్విచింగ్‌ కాస్ట్‌" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్‌ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్‌ కాస్ట్‌'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.

ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్‌ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.

మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల ఛాయిస్‌ మన అంచనాలకు తగ్గట్లు ఉండదు. కొన్నిసార్లు నమ్మకం, అలవాటు, ముందస్తు అనుభవం కూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్‌ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)