Breaking News

అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో

Published on Sun, 04/27/2025 - 17:08

పహల్గాం/న్యూఢిల్లీ: ఒక ఫొటోగ్రాఫర్‌ చెట్టు మీది నుంచి తీసిన వీడియో పహల్గాం ఉగ్ర ఘటన దర్యాప్తులో కీలకంగా మారింది. అలాగే ఘటన సమయంలో కుటుంబంతో కలిసి అక్కడికి విహారయాత్రకు వచ్చిన ఒక సైనికాధికారి ప్రత్యక్ష సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలం కూడా దర్యాప్తు అధికారులకు ఎంతో సాయపడుతోంది. నాటి ఘటన క్రమాన్ని ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. 

కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు పహల్గాం ఘటన దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్వీకరించింది. ఆదివారం జమ్మూలో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించింది. ఐజీ, డీఐజీ, ఎస్పీలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటన జరిగిన రోజు నుంచే స్థానిక పోలీసులకు దర్యాప్తులో ఎన్‌ఐఏ బృందం సాయపడటం తెల్సిందే. దాడి నుంచి బయటపడి స్వస్థలాలకు వెళ్లిన పర్యాటకుల నుంచి వేర్వేరు బృందాలు వాంగ్మూలాలను సేకరిస్తున్నాయి. 

సైన్యాధికారి ఏం చెప్పారంటే... 
లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న సైనికాధికారి కాల్పుల వేళ తన కుటుంబాన్ని సురక్షిత ప్రాంతంలో దాచేశారు. ఉగ్రవాదులు ఎటు నుంచి వచ్చారు, తొలుత ఎవరిని చంపారు, తర్వాత ఎటు వెళ్లారు వంటి వివరాలను వాంగ్మూలంలో చెప్పారు. ‘‘తొలుత ఇద్దరు ఉగ్రవాదులు చిన్నపాటి దుకాణాల వెనుక నుంచి హఠాత్తుగా వచ్చి పర్యాటకులను ‘కల్మా’ చదవాలని ఆదేశించారు. చదవని నలుగురిని తలపై కాల్చిచంపారు. దాంతో అంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఉగ్రవాదులు వారి తల, గుండెకు గురి చూసి కాల్చడంతో మరికొందరు చనిపోయారు.

 కాసేపటికే మరో ఇద్దరు ఉగ్రవాదులు అడవి నుంచి బయటికొచ్చి పర్యాటకులపైకి కాల్పులకు దిగారు’’ అని ఆయన వివరించినట్టు సమాచారం. కాల్పుల ఘటనను ఉగ్రవాదులు తమ బాడీ క్యామ్‌లలో రికార్డ్‌ చేసుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. యువ నేవీ అధికారి లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ పెళ్లయిన ఆరు రోజులకే దాడిలో చనిపోవడం తెలిసిందే. దాంతో ఆయన భార్య హిమాన్షీ గుండెలవిసేలా రోదిస్తూనే ఫోన్‌ చేసి పోలీసులకు వెంటనే సమాచారమిచ్చారు. దాడిపై వారికి వచ్చిన తొలి కాల్‌ అదే. దాంతో పహల్గాం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.  

22 గంటలు ట్రెక్కింగ్‌ చేసొచ్చి చంపారు 
భద్రతా బలగాల కంటబడకుండా ఉండేందుకు ఉగ్రవాదులు రోడ్డు మార్గంలోకాకుండా అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకర పర్వత సానువుల గుండా వచ్చినట్టు వెల్లడైంది. కోకెర్నాగ్‌ అటవీ ప్రాంతం గుండా 22 గంటలు ట్రెక్కింగ్‌ చేసి మరీ బైసారన్‌ చేరుకున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పర్యాటకులను కాల్చే క్రమంలో ఒక స్థానికుడు, మరో పర్యాటకుడి నుంచి వాళ్లు మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. తిరిగి వెళ్తూ వాటిని మార్గమధ్యంలో ధ్వంసం చేశారని తెలుస్తోంది. దాడిలో ఏకే 47, ఎం4 మెషీన్‌గన్లు వాడినట్టు జాగా ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలింది.  

ప్రాణభయంతో చెట్టెక్కి, వీడియో తీసి...
ఉగ్రవాదులు దాడికి దిగిగినప్పుడు అక్కడే ఉన్న స్థానిక ఫొటోగ్రాఫర్‌ ఒకరు ప్రాణభయంతో చెట్టెక్కి కొమ్మల్లో నక్కారు. అలా వారి కంట పడకుండా తప్పించుకున్నారు. కళ్లెదుటే అమాయక పర్యాటకులపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించిన తీరును కెమెరాలో బంధించారు. దాడి క్రమాన్ని స్పష్టంగా పట్టిచ్చిన ఆ వీడియో ఎన్‌ఐఏ దర్యాప్తులో కీలకంగా మారింది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)