Breaking News

ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..

Published on Tue, 05/20/2025 - 11:59

పూణే: ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్(Scientist Jayant Vishnu Narlikar) మహారాష్ట్రలోని పూణేలో నేడు (మే 20) కన్నుమూశారు. భారతదేశంలో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో నార్లికర్ గణనీయమైన పాత్ర పోషించారు. విశ్వోద్భవ శాస్త్రం, బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాల రూపకల్పనలో నార్లికర్‌ విశేష  కృషి చేశారు. 

పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(Inter-University Center for Astronomy and Astrophysics) (ఐయూసీఏఏ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా పేరొందారు. 1938, జూలై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ ఆయన ఫ్రెడ్ హోయిల్‌తో కలిసి హోయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ విశ్వోద్భవ నమూనాలను సవాలు చేసింది.

తన శాస్త్రీయ రచనలతో పాటు నార్లికర్ పలు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆయన మరాఠీలో సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. నార్లికర్‌ రచనలు కొత్త తరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తున్నాయి.  ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో నార్లికర్ చేసిన కృషిగా గాను ఆయన పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004), మహారాష్ట్ర భూషణ్ (2010) తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1980ల చివరలో ఆయన ప్రముఖ టీవీ షో ‘కాస్మోస్: ఎ పర్సనల్ వాయేజ్‌’లో కనిపించారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును మరోమారు గుర్తు చేసింది.

ఇది కూడా చదవండి: World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే!

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)