Breaking News

ఆపరేషన్‌ సింధు: ఇరాన్‌ నుంచి మరో విమానం.. స్వదేశానికి 310 మంది భారతీయులు

Published on Sat, 06/21/2025 - 20:11

ఢిల్లీ: ఆపరేషన్‌ సింధు కొనసాగుతోంది. ఇరాన్‌ నుంచి మరో 310 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు తరలింపు విమానం ఢిల్లీలో ల్యాండ్‌ అయ్యింది. ఇప్పటివరకు 827 మందిని భారత్‌కు తరలించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇరాన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా దేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు భారత్‌ చర్యలు చేపట్టింది.

కాగా, నిన్న (శుక్రవారం) రాత్రి 11.30 గంటలకు ఇరాన్‌ నుంచి 290 మంది భారతీయులతో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం.. మొదటి దశలో 110 మంది పౌరులతో తరలింపు విమానం భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. ఓవైపు యుద్ధం కొనసాగుతున్నాసరే ఇరాన్‌ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించింది. పౌర విమానాల రాకపోకల కోసం గతంలో మూసేసిన గగనతలాన్ని భారత్‌ కోసం ప్రత్యేకంగా తెరిచింది. దీంతో ఇరాన్‌ నుంచి భారత్‌కు విమానాలు చేరుకుంటున్నాయి.

యుద్ధం కారణంగా అక్కడి మష్హాద్‌ సిటీలో ఎక్కువ సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆపరేషన్‌ సిందూలో భాగంగా భారతసర్కార్‌ ఇరాన్‌లోని కొందరు విద్యార్థులను రోడ్డుమార్గంలో అర్మేనియాకు తరలించి అక్కడి నుంచి విమానమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చింది. ఇకపై నేరుగా ఇరాన్‌ ఎయిర్‌పోర్ట్‌ల నుంచే విమానాలు తిరుగు ప్రయాణం కానున్నాయి.

 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)