Breaking News

అంజూ ఘటన: ఆ కుటుంబానికి ఉపాధే కరువైంది!

Published on Fri, 08/04/2023 - 15:17

జైపూర్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ అనే వివాహిత పాక్‌కు వెళ్లి అక్కడే తన ప్రియున్ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనల అనంతరం అంజూ కుటుంబం స్థానికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంజూ నిర్వాకం తర్వాత స్థానికులు ఆ కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నారట. కేవలం గ్రామంలోనే గాక ఉద్యోగంలో కూడా వెలివేతకు గురికావాల్సి వస్తోందని సమాచారం. 

అంజూ తండ్రి గయా ప్రసాద్ థామస్ బౌనా అనే గ్రామంలో బట్టల కుట్టే వృత్తి చేస్తున్నారు. తన కూతురు అంజూ పాక్‌కు వెళ్లిపోయిన తర్వాత ఎవరూ తనకు ఉపాధిని కల్పించడం లేదని చెప్పారు. మొదట సానుభూతి చూపిన గ్రామస్థులే.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారని వాపోయారు. అటు.. అంజూ సోదరుడు, భర్తకు కూడా తమ కంపెనీల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందట. అంజూ సోదరుడు డేవిడ్ ఓ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. అయితే.. అంజూ వ్యవహారం తర్వాత తాను పనిచేసే సంస్థ డేవిడ్‌ను ఇంటివద్దే ఉండమని చెప్పేసిందని చెప్పారు. 

అంజూ భర్తను కూడా ఆయన పనిచేసే కంపెనీ బెంచ్‌కే పరిమితం చేసిందట. ఏ పని అప్పగించడం లేదట. ఖాలీ గానే ఉంచున్నారని వెల్లడించారు. అంజూ అనే వివాహిత ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ప్రియుని కోసం పాకిస్థాన్‌కు కొన్ని రోజుల క్రితం వెళ్లిపోయింది. అక్కడే తన పేరును ఫాతిమాగా మార్చుకుని పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఘటనల తర్వాత అంజూపై ఆమె తండ్రి తీవ్ర ఆరోపణలు చేశాడు. 

తనకు చెప్పకుండానే పాకిస్థాన్‌కు వెళ్లిందని అంజూ భర్త తెలిపారు. పాక్ వెళ్లాక రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే.. అంజూ పాక్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అంజూ కొత్త జంటకు భూములు వంటి అనేక కానుకలు సమర్పించారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించారు. 

ఇదీ చదవండి: భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)