Breaking News

జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్

Published on Sat, 11/15/2025 - 13:59

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి  అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు. ఇందులో ఆశ్చర్యమెముంది అనుకుంటున్నారా. ఆయన ఎటువంటి ప్రచారం లేకుండా ఎన్నికల సమయంలో జైలులో ఉండి తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అనంతరం హత్యా కేసులో ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జైలులో ఉండడంతో ఆయన సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటీకీ అనంత్ సింగ్ తన ప్రత్యర్థిపై 28 వేల మెజార్టీతో గెలుపొందారు.

జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నామినేషన్ సైతం దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. ఇంతలోనే జన సూరజ్  పార్టీనేత హత్యకు సంబంధించి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దీంతో  అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మెుకామా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ నాయకులు ప్రజలలో ఆయనకున్న ఆదరణను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

జేడీయూ నేత అనంత్ సింగ్ పై దాదాపు 28కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహించే మెుకామా నియోజకవర్గం బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో ఉంటుంది. అక్కడి పొలిటికల్ హీట్ సెంటర్లలో  మెుకామా  ఒకటి. ఆ నియోజకవర్గంలో అనంత్ సింగ్ చాలా ప్రభావవంతమైన లీడర్ అనంత్ సింగ్ ఇదివరకూ ఐదుసార్లు అక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో అక్రమ ఆయుధాల కేసులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవగా తన భార్య మెుకామా  నుండి పోటీ చేసి గెలిచింది.

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)