Breaking News

ఆ స్లీపర్‌ బస్సులపై వేటు

Published on Sat, 11/29/2025 - 09:50

ఇటీవలి కాలంలో  స్లీపర్‌ బస్సులలో  ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించే అన్ని స్లీపర్ కోచ్ బస్సులను తొలగించాలని భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ధర్మాసనం, ఆదేశాలు జారీ చేసింది.  ఈమేరకు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని NHRC అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు  ఆదేశాలిచ్చింది.  

దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి స్లీపర్ బస్సులు ఒకప్పుడు చాలా మంది భారతీయులకు సులభమైన,  చౌకైన రాత్రి ప్రయాణం. కానీ లోపభూయిష్టమైన భద్రతా ప్రమాణాలు, తనిఖీలు లేకపోవడంతో భారీ ప్రమాదాలు సంభవించాయి. అనేక మందిని పొట్టన పెట్టుకున్నాయి. దీంతో  స్లీపర్‌ బస్సులలోని భద్రతా ప్రమాణాలపై భారీ ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, జైసల్మేర్‌లో జరిగిన సంఘటనల తర్వాత మరింత  చర్చనీయాంశంగా  మారింది.  ఇవి యాదృచ్చికంగా జరిగినవి కావనీ, సరైన  భద్రతా పద్ధతులను పాటించకపోవడం, బస్సుల రూపకల్పనలో సమస్యలు,  నిబంధనలు, సరైన తనిఖీలు లేకపోవడమే ప్రధాన కారణమని  ఉన్నాయని  అలు నివేదికలు చెబుతున్నాయి .

భద్రతా ప్రమాణాలు
భారతదేశంలో ఇప్పటికే AIS-052 ,AIS-119 వంటి నియమాలు ఉన్నాయి.  స్లీపర్ బస్సులలో అత్యవసర నిష్క్రమణలు, అగ్ని-సురక్షిత ఇంటీరియర్‌లు, పైకప్పు హాచ్‌లు,  తప్పించుకునేందుకు  సరైన  మార్గాలు ఉండాలని ఈ నియమాలు చెబుతున్నాయి. కానీ  చాలా బస్సులు వీటిని పాటించవు. చాలా మంది ఆపరేటర్లు సాధారణ సీటర్ బస్సులను తీసుకొని చిన్న వర్క్‌షాప్‌లలో స్లీపర్ బస్సులుగా మారుస్తారు. ఈ సందర్భంగా కొన్ని మార్గాలను బ్లాక్‌ చేయడం, అదనపు  బెడ్స్‌ వేయడం, మండే షీట్‌లను ఉపయోగించడం, తప్పించుకోవడానికి స్థలం లేకుండా చేయడం లాంటివి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని రవాణా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి : పాతికేళ్లకే యంగెస్ట్‌ బిలియనీర్‌.. అమన్‌ అంటే అమేయ ప్రతిభ

కొన్ని బస్సుల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు పగలగొట్టలేని కిటికీలులేకపోవడం, లోపలినుంచి   బైటికి వచ్చే మార్గాలు సరిగ్గా లేకపోవడం వల్లన లోపల చిక్కుకుపోతున్నారని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కొంతమంది రవాణా నిపుణులు బహిరంగంగా ఈ బస్సులు చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి బస్సుల డిజైన్‌  అస్సలు సురక్షితం కాదని మాజీ IOC చైర్మన్ శ్రీకాంత్ ఎం. వైద్య కూడా స్పష్టం చేశారు. అంతేకాదు. కొన్ని స్లీపర్ బస్సులను మరమ్మతులు చేయడం, అప్‌ గ్రేడ్‌ చేయడంకాకుండా వాటిని తొలగించాలని కూడా పేర్కొన్నారు. అటు చాలా దేశాలు తమ నియమాలను మార్చుకున్నాయి.  చైనా కూడా  2012లో మల్టీ-బంక్ స్లీపర్ బస్సులను  నిషేధించింది.  

ఇదీ చదవండి: 17 ఏళ్లకే ఏఐ రోబో టీచర్‌తో సంచలనం

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు