Breaking News

రూ. 250 కోట్ల భరణం ఆఫర్‌ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్‌

Published on Thu, 03/05/2026 - 15:34

చెన్నై: తమిళ స్టార్ హీరో ,టీవీకే అధినేత  విజయ్ దళపతి భార్య సంగీత సోర్నలింగంతో సెటిల్మెంట్‌కు రెడీ అవుతున్నారా?  27 ఏళ్ల వివాహ జీవితం తర్వాత తన భర్త నుండి విడాకులకు దరఖాస్తు   చేసుకున్నారన్న వార్త అటు సినీ అభిమానుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా తన భర్త విజయ్‌కు  నటితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగా విడాకులు కోరుతున్నట్టు పేర్కొనడం మరింత దిగ్బ్రాంతి రేపింది.తాజాగా విజయ్ దళపతి కేసును పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.

రూ. 250 కోట్ల భరణం ఆఫర్
తాజా నివేదిక ప్రకారం, విజయ్ దళపతి ఈ విషయాన్ని కోర్టులో పరిష్కరించుకోవాలని ఆలోచిస్తున్నారు.  తమిళనాట తన రాజకీయ భవిష్యత్తును  పరీక్షించుకుంటున్న  విజయ్‌ తన వ్యక్తిగత  ప్రతిష్టకు భంగం రాకుండా  ఈ వివాదానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నాడట. ఈ నేపథ్యంలో సంగీతతో విడాకుల వివాదాన్ని కోర్టు బయటే చక్కదిద్దుకునే పనిలో విజయ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సామరస్య పరిష్కారం కోసం  భార్యతో దీని గురించి పలు చర్చలు  మొదలు పెట్టారట. తన భార్యకు రూ. 250 కోట్ల భరణం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.  సంగీత, ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషాలకు ఈ సెటిల్మెంట్ మొత్తం చెల్లించాల్సి ఉంది. విజయ్ తన కుటుంబ గౌరవాన్ని కాపాడే నిమిత్తం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడట. ఇరు పక్షాలు పరస్పర ఒప్పందం కుదుర్చుకుంటే విడాకుల పిటిషన్ ఉపసంహరించు కోనుందని కోలీవుడ్ మీడియాలో  వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.   

ఇదీ చదవండి: ఆమెతో వివాహేతర సంబంధం : విజయ్‌కు విడాకుల నోటీసులు

విజయ్‌-సంగీత వైవాహిక జీవితం
విజయ్ సంగీతను మొదటిసారి 1996లో కలిశాడు. ఆమె శ్రీలంక హిందూ, బ్రిటన్‌లో పెరిగింది.  అప్పటికే  స్టార్‌హీరోగా పేరుతెచ్చుకున్న  విజయ్‌కి సంగీత పెద్ద అభిమాని. ఆమె UKలోని తన ఇంటిని వదిలి చెన్నైలో తన అభిమానిని కలవడానికి వచ్చేసింది. అది ప్రేమకు దారి తీసింది. చివరకు ప్రత్యేక వివాహ చట్టం కింద  వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత 27 ఏళ్లుగా అన్యోన్య కాపురం తరువాత సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. సంగీత విడాకుల పిటిషన్ కాపీ ప్రకారం, విజయ్ దళపతి వివాహేతర సంబంధం ఉన్న నటితో విదేశాల్లో  చక్కర్లు కొట్టాడనీ, అలాగే ఆ నటి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తమ విహారయాత్ర చిత్రాలను షేర్ చేస్తూనే ఉందని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. ఇది తనకు తన పిల్లలకు తీవ్ర బాధ కలిగించిందని కూడా ఆమె పేర్కొంది. అంతేకాదు ఈ వివాదం తరువాత విజయ్‌ కుమారుడు సోషల్‌మీడియాలో ఆయనను అన్‌ఫాలో  చేయడం కూడా వార్తల్లో  నిలిచింది.

ఇదీ చదవండి: మూడు రోజులు ఫ్రీ ఫుడ్‌ : పోటెత్తిన జనం

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)