Breaking News

Air India: టేకాఫ్‌ అయిన పావుగంటకే..

Published on Fri, 07/25/2025 - 15:52

అహ్మదాబాద్‌ ఘటన తర్వాత.. విమానాల్లో, అందునా ఎయిరిండియా సంస్థ విమానాల్లోనే ఎక్కువగా సాంకేతిక సమస్యలూ బయటపడున్నాయి. ఈ క్రమంలో విమానాల ఆలస్యం, రద్దు, దారి మళ్లింపు, వెనక్కి రావడం లాంటి ఘటనలూ నమోదు అవుతున్నాయి. తాజాగా..

జైపూర్‌ నుంచి ముంబై బయల్దేరిన ఎయిరిండియా విమానం.. పావు గంటకే సాంకేతిక సమస్యతో వెనక్కి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.35గం.కు బయల్దేరిన విమానం.. 18 నిమిషాల తర్వాత తిరిగి జైపూర్‌ ఎయిర్‌పోర్టుకే వచ్చేసింది. సాంకేతిక సమస్య తలెత్తడంతోనే విమానాన్ని పైలట్‌ వెనక్కి తీసుకురావాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది తెలియాల్సి ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత రావాల్సి ఉంది. 

బుధవారం(జులై 23వ తేదీ) సైతం ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి 160 మంది ప్రయాణికులతో బయల్దేరాల్సిన ఎయిరిండియా విమానం.. సాంకేతిక సమస్యతో రద్దయ్యింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమంటూ ఆ సమయంలో ఎయిరిండియా ప్రకటించింది. అదే రోజు.. 

కేరళ కాలికట్‌(కోజికోడ్‌) నుంచి దోహాకు 188 మందితో(సిబ్బంది సహా) బయల్దేరిన ఎయిరిండియా విమానం.. రెండు గంటల తర్వాత తిరిగి కాలికట్‌ ఎయిర్‌పోర్టుకే చేరుకుంది. ఇది కూడా సాంకేతిక సమస్యతోనే వెనక్కి వచ్చినట్లు విమానయాన సంస్థ ప్రకటించింది.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)