Breaking News

ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్‌ దాడి 

Published on Sun, 12/21/2025 - 05:40

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుడిపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ దాడి చేసిన ఘటనపై తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ పాయింట్‌ వద్ద క్యూను పట్టించుకోకుండా కొందరు ఎయిరిండియా ఉద్యోగులు వెళ్లిపోవడంపై తలెత్తిన వివాదంతో ఈ గొడవ జరిగినట్లు భావిస్తున్నారు. 

ఇందుకు సంబంధించిన ఒక వీడియోను అంకిత్‌ దివాన్‌ అనే ప్రయాణికుడు శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఎయిర్‌పోర్టులోని టెరి్మనల్‌–1 వద్ద కొందరు సిబ్బంది క్యూలో ఉన్న వారిని నెట్టేసి ముందుకు వెళ్తుండగా, తాను అభ్యంతరం తెలిపానని ఆయన పేర్కొన్నారు. దీంతో, వేరే విమానంలో అక్కడికి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్‌ ఒకరు నానాదుర్భాషలాడుతూ తనపై చేయిచేసుకున్నారని, పక్కనే ఉన్న తన కూతురు ఈ ఘటన చూసి షాక్‌కు గురైందని అంకిత్‌ పేర్కొన్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చూశాకనే తమకు తెలిసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై విమానాశ్రయం అధికారులు, ఎయిరిండియా సిబ్బందితోపాటు బాధితుడి నుంచి కూడా ఫిర్యాదు రాలేదని వివరించారు. ఒక వేళ వస్తే, ఘటనకు దారి తీసిన పరిస్థితులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా, ప్రయాణికుడిపై దాడి చేసినట్లుగా భావిస్తున్న పైలట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించామని ఎయిరిండియా తెలిపింది. అంతర్గత దర్యాప్తు చేపట్టామని పేర్కొంది. కాగా, ఆరోపణలను ఎదుర్కొంటున్న పైలట్‌..ఘటన అనంతరం ఇండిగో విమానంలో బెంగళూరు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)