Breaking News

పాక్‌ మద్దతు.. భారత్‌లో మరో ఉగ్రదాడి?

Published on Thu, 11/06/2025 - 07:33

శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని, పాకిస్తాన్‌ మద్దతుతో పలు ఉగ్రవాద సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నట్లు అధికారవర్గాలకు సమాచారం అందిందని ‘ఎన్‌డీటీవీ’ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన దరిమిలా పాక్‌ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మొహమ్మద్ (జేఈఎం)లు కొత్తగా సమన్వయ దాడులకు యత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.

ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం గత సెప్టెంబర్ నుండి ఉగ్రవాద సంస్థలు భారత్‌లోకి చొరబాట్లు, నిఘా, సరిహద్దు లాజిస్టిక్స్‌ను ముమ్మరం చేశాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ),ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)సభ్యుల సహాయంతో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి చొరబాటు మార్గాల ద్వారా  ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని ఎల్‌ఈటీ యూనిట్ డ్రోన్‌లను ఉపయోగించి వైమానిక నిఘా నిర్వహించిందని,  ఎల్‌ఓసీలోకి చొరబడే మార్గాలను గుర్తించిందని, రాబోయే రోజుల్లో ఫిదాయీన్ తరహా దాడులు లేదా ఆయుధ దాడులకు ఇది సూచన అని నిఘా అధికారులు వివరించారు.

మాజీ ఎస్‌ఎస్‌జీ సైనికులు, ఉగ్రవాదులతో కూడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌లు (బీఎటీలు) పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకె) అంతటా మోహరించారని ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. గత అక్టోబర్‌లో  జమాత్ ఈ ఇస్లామి, హిజ్బుల్ ముజాహిదీన్ ఐఎస్‌ఐ సభ్యులు ఒకచోట సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన నష్టాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సమావేశంలో ప్రణాళికలను ఖరారు చేశారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. భారత రక్షణదళ అధికారులు అధికారులు ఈ నిఘా సమాచారాన్ని క్లిష్టమైన హెచ్చరికగా అభివర్ణించారు.  ఈ నేపధ్యంలో  భారత సైన్యం, నిఘా యంత్రాంగం హై అలర్ట్‌లో ఉంది. గుజరాత్, రాజస్థాన్ పశ్చిమ సరిహద్దుల్లో భారత్‌ తన  త్రిశూల్ ట్రై-సర్వీస్ విన్యాసాలను నిర్వహిస్తున్న సమయంలో ఈ నిఘా సమాచారం అందింది. 

ఇది కూడా చదవండి: బాలిక అబద్ధం.. ‘పోక్సో’కు అమాయకుడు బలి
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)