Breaking News

పక్షి ఢీ కొట్టడంతో ఎయిరిండియా విమాన సర్వీస్‌ రద్దు!

Published on Fri, 06/20/2025 - 16:02

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు.. ఆ మాటకొస్తే మిగతా సంస్థల విమానాలు కూడా రకరకాల కారణాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక సమస్యలతో ప్రయాణికుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. పక్షికి ఢీ కొట్టడంతో ఏకంగా ఎయిరిండియా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది.

శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణే (మహారాష్ట్ర)కు ఎయిరిండియా AI2470 విమానం చేరుకుంది. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో విమానాన్ని పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్‌ టీంను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు జరిపింది. ఆపై ఆ విమాన సర్వీసును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది.

✈️ జరిగింది ఇదే..

  • జూన్‌ 20వ తేదీ..  ఉదయం 5:31కి ఢిల్లీ నుంచి ఏఐ2470 విమానం బయలుదేరి, 7:14కి పుణేలో ల్యాండ్ అయింది.

  • ల్యాండింగ్ తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీకొన్నట్లు గుర్తించారు.

  • దీంతో, అదే విమానంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన AI-2470 ఫ్లైట్‌ను రద్దు చేశారు.

🛠️ తీసుకున్న చర్యలు

  • విమానాన్ని గ్రౌండ్ చేశాక.. ఇంజినీరింగ్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది.

  • ప్రయాణికుల కోసం వసతి ఏర్పాట్లు, పూర్తి రీఫండ్‌లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన

  • ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా అందిస్తామని తెలిపిన ఎయిరిండియా.
     

🔍 జూన్‌ 12వ తేదీన లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులతో పాటు కింద ఉన్న మరో 38 మంది మరణించారు. ఈ ప్రమాద నేపథ్యంలో.. ఎయిరిండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)