Breaking News

‘కాక్రోచ్‌’ ఉద్యమానికి ప్రకాశ్‌ రాజ్‌ మద్దతు

Published on Sun, 07/12/2026 - 04:27

న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, పరీక్ష వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన శనివారం 22వ రోజుకు చేరుకుంది. సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ జంతర్‌ మంతర్‌ వద్దకు చేరుకొని నిరసన కారులకు సంఘీభావం తెలిపారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన అమరణ నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. 

తాను ఆధునిక గాంధీనో లేదా హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని వాంగ్‌చుక్‌ ఈ సందర్భంగా అన్నారు. కేరళ మాజీ మంత్రి థామస్‌ ఐజాక్, త్రిపుర ప్రతిపక్ష నాయకుడు జితేంద్ర చౌదరి కూడా జంతర్‌మంతర్‌ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. ప్రకాశ్‌ రాజ్, ఐజాక్, జితేంద్ర చౌదరి నిరసనకారులతో మాట్లాడారు. 

పరీక్షల్లో పదే పదే జరుగుతున్న అవకతవకలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పారదర్శకమైన, నిష్పక్షపాత మైన, విశ్వసనీయమైన పరీక్షా విధానం కోసం చేపట్టిన ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామ ని ప్రకటించారు. వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామని వెల్లడించారు. సోనమ్‌ వాంగ్‌చుక్‌ హెల్త్‌ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. 

నిద్రించినప్పుడు రక్తపోటు 109/72 ఎంఎం హెచ్‌జీ గాను, కూర్చున్నప్పుడు 106/74 ఎంఎం హెచ్‌జీ గాను నమోదైంది. హృదయ స్పందన నిమిషానికి 81 సార్లు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి 78 ఎంజీ/డీఎల్‌ గాను రికార్డయ్యింది. ఆయన బరువు 58.45 కిలోలకు చేరుకుంది. నిరాహార దీక్ష ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 7.5 కిలోల బరువు తగ్గారు. వాంగ్‌చుక్‌ శరీరంలో నీటి శాతం బాగానే ఉందని, మానసికంగా చురుకుగా ఉన్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు. 

జీవితానికి మీరే హీరో కావాలి 
దీక్ష కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు వాంగ్‌చుక్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంత బలహీనంగా ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ తన సంకల్పంలో మార్పు రాలేదన్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. చాలామంది తనను 21వ శతాబ్దపు గాంధీ లేదా ఆధునిక గాంధీ అని పిలుస్తున్నారని, మరికొందరు తనను హీరో అంటున్నారని చెప్పారు.

 ఈ వ్యాఖ్యలు తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని వెల్లడించారు. తాను గాంధీని కాదు, హీరోని కూడా కాదని వివరణ ఇచ్చారు. బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించే ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని స్పష్టంచేశారు. ఇతరుల్లో హీరోల కోసం వెతకడం మానేసి, పౌరులుగా బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు. ‘‘జీవితానికి మీరే హీరో అవ్వండి. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి’’అని పిలుపునిచ్చారు. 

విద్యార్థులకు న్యాయం జరిగేలా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ప్రజలకు సూచించారు. ‘‘మీరు ప్రతిరోజూ ఇక్కడికి రాలేకపోతే, కనీసం ఒక్క రోజైనా జంతర్‌ మంతర్‌ వద్ద మాతో చేరండి. మీరు ఢిల్లీకి రాలేకపోతే, ఎక్కడ ఉన్నా ఉపవాసం పాటించి మీ సందేశాన్ని పంచుకోండి’’అని వాంగ్‌చుక్‌ కోరారు. నిరసనకారులు లేవనెత్తిన సమస్యలను ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించేలా ఒత్తిడి పెంచడానికి జూలై 20న పార్లమెంటు వరకు ప్రతిపాదించిన యాత్రలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)