ఈరోజు రాత్రి మేమంతా అరెస్ట్‌.. సీజేపీ దీప్కే సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 07/24/2026 - 11:30

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ పార్టీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి సీజేపీ టీమ్‌ మొత్తాన్ని అరెస్ట్‌ చేయవచ్చు అని చెప్పుకొచ్చారు. తాము అరెస్ట్‌ అయినా ఉద్యమం శాంతియుతంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దీంతో, ఈరోజు ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. 

జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే...‘ఈ రాత్రికి సీజేపీ టీమ్‌ మొత్తాన్ని అరెస్ట్‌ చేయవచ్చు. అరెస్ట్‌ చేసి మరో తప్పు చేయవద్దని ప్రభుత్వానికి చెబుతున్నా. అరెస్ట్‌తో ఆందోళన మరింత ఉధృతం అవుతుంది. మేము అరెస్ట్‌ అయినా ఉద్యమం శాంతియుతంగా సాగాలి. అలాగే, సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను విరమించడం శుభపరిణామం. ఎంతో సంతోషంగా ఉంది.  ఆయన ఆరోగ్యం పట్ల మాకు ఆందోళన ఉండేది. 26 రోజులకు పైగా ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఈ దేశానికి ఎంతో విలువైనది” అని వ్యాఖ్యలు చేశారు.

అయితే, తమ ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మాకు మరే పరిష్కారం ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని దీప్కే తేల్చి చెప్పారు.

కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందిస్తూ... చర్చలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. నీట్‌ పేపర్ లీక్ వివాదం, పోటీ పరీక్షల్లో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది.

CJP టీమ్ మొత్తం అరెస్ట్..! ఈ రాత్రికే ముహూర్తం..

మరోవైపు.. సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డా గారితో సమావేశం ఉంది. ఈ సమావేశానికి జితేంద్ర సింగ్ గారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని మాకు సమాచారం. చర్చల్లో ఏం జరిగిందో మీడియాకు వెల్లడిస్తాం” అని తెలిపారు.

సోనమ్ గారి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో దీక్ష విరమించాలని మేము నిరంతరం కోరుతున్నాం. మా రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చింది. శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అయితే, ఈ హామీలతో పోరాటం ముగిసినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరిగిందని వ్యాఖ్యానించారు. ‘మొదటిసారి ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా ఉంటే, అత్యంత కఠినమైన చర్యగా ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి’ అని రంకా అన్నారు.

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)