Breaking News

61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా?

Published on Mon, 07/06/2026 - 17:57

61 ఏళ్ల వయసులో బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌, తన  ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి  హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ముంబైలోని బాంద్రాలో ఆమిర్‌ నివాసంలో జులై 5న ఆదివారం జరిగిన ఈ వివాహానికి  మొదట భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు, కుమార్తె కూడా హాజరు కావడం విశేషంగా నిలిచింది. అయితే, ఈ పెళ్లిలో మరో విషయం కూడా ఆసక్తికరంగా నిలిచింది. కొత్త పెళ్లికొడుకుగా ఆమిర్ ఖాన్ కేవలం ఒక కాలికి 'ఘుంగ్రూ' (మువ్వల పట్టీ) ధరించారు.  దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింగ తెగ వైరల్‌గా మారాయా? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

ఇటీవలి సెలబ్రిటీల పెళ్లిళ్లలో వధువులతో పోటీగా పెళ్లి కొడుకులు కూడా మహిళలు ధరించే ఆభరణాలను ధరించడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అందులో భాగంగానే ఆమీర్‌ ఖాన్‌ కూడా ఒక కాలికి పట్టీ ధరించాడా లేక ఇది ఏదైనా వివాహ సంప్రదాయమా? తన గత రెండు పెళ్లిళ్ల సమయంలోనూ  కూడా అతను ఇలాగే చేశాడా? అనేది నెట్టింట  చర్చకు దారి  తీసింది. 

ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్‌ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు

ఆమిర్ దృష్టిలో ఫ్యాషన్ అంటే కేవలం ప్రత్యేక సందర్భాల్లో ఏదో ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించడం మాత్రమే కాదు; దానికి ఖచ్చితంగా ఒక పెర్సనల్‌టచ్‌ కూడా ఉంటుంది అనడానికి ఈ గజ్జెల పట్టీ ఒక ఉదారణ అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఆమిర్ తెలుపు రంగు ధోవతితో, తలపాగా చాలా స్పెషల్‌గా కనిపించాడు. అంతేకాదు ఆయన ఎంచుకున్న ఆభరణాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఏది ఏమైనా ఒక పురుషుడు కేవలం ఒక కాలి పట్టీని ధరించడం ఫ్యాషన్ ప్రపంచంలో ఒక కొత్త  ట్రెండ్‌ అనే చెప్పాలి.

 > సాధారణంగా కాలి పట్టీ అనేది స్త్రీలు ధరించే ఆభరణం, అందుకే ఆయన ఎంపికపై చర్చ మొదలైంది. ఏ ఆభరణం ఎవరికి పరిమితం అనేది పెద్ద విషయం కాదు ,కానీ ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా ఏదైనా చేసి ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమిర్ ఫ్యాషన్ విషయంలో ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు దశాబ్దం క్రితం, అంటే 2017లో, ఆమిర్ ఖాన్ ముక్కు కుట్టించుకున్నారు. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్‌' చిత్రంలో 'ఫిరంగి మల్లా' అనే మోసగాడి పాత్రకోసం ముక్కు కుట్టించుకున్నారట. అయితే ఇది కేవలం పాత్ర కోసం మాత్రమే కాదనీ, దీని వెనుక వ్యక్తిగతమైన ప్రేరణ ఉందని పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది.  తన స్కూల్‌ రోజుల నాటి  సింధీ  ఫ్రెండ్‌ ముక్కుకు పోగు ధరించేవాడట. ఈ ప్రేరణతోనే తన పాత్ర కోసం ఒక ముక్కుపోగును ఆమిర్ స్వయంగా దానిని డిజైన్ చేసుకున్నాడట. 

ఇదీ చదవండి : ఆమీర్‌ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)