Breaking News

99 లక్షల ఓటర్లు ఔట్‌

Published on Wed, 10/28/2026 - 12:14

సర్‌ పేరుతో విచ్చలవిడిగా ఓట్లను తీసేస్తామంటే కుదరదు. ఎన్నికల సంఘం జవాబుదారీగా వ్యవహరించాలి.. అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ సహా అనేకమంది మేధావులు, సామాజిక కార్యకర్తలు నిరసనలు జరిపినా ఏమీ మారలేదు. సర్‌ అనే ఆయుధంతో ఎన్నికల     సంఘం ఊచకోత కోసింది.

కర్ణాటక: కన్నడనాట ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భారీగా ఓటర్లు అదృశ్యమయ్యారు. ఏకంగా 99 లక్షల ఓట్లకు కోత పడడంతో ఆ మేరకు ఓటర్ల సంఖ్య క్షీణించింది. రాష్ట్రంలో తుది ఓటరు జాబితాలో 4.55 కోట్ల ఓటర్లు మిగిలారు. సర్‌కు ముందు 5.54 కోట్ల మంది ఓటర్లు ఉండేవారు. తుదిజాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం గమనార్హం.  

4 నెలలుగా ఏరివేత  
గత 4 నెలలుగా వాద ప్రతివాదనల మధ్య కన్నడనాడులో సర్‌ వ్యవహారం కొనసాగింది. వేలాది మంది బీఎల్‌ఓలు ఓటర్ల సవరణను నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) అన్బుకుమార్‌ ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. మంగళవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.  

కోటి నుంచి 99 లక్షలకు  
2026 జూన్‌ 16 నాటికి కర్ణాటక ఓటర్ల జాబితాలో 5,54,32,314 మంది ఉండేవారు. సర్‌ ద్వారా పరిశీలన జరిపి డబుల్‌ ఓట్లు, అడ్రస్‌లో లేకపోవడం, మృతులు.. ఇలా పలు అంశాల కింద తొలగింపు సాగించారు. ఇలా 1,07,96,339 పేర్లను పరిశీలనలో పెట్టారు. ఆగస్టు 24న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో సుమారు 4.46 కోట్ల ఓటర్లు తేలారు. పార్టీలు, ఓటర్ల అభ్యంతరాల తరువాత పరిశీలన జరిపి మరికొంతమందిని చేర్చారు. అంతిమ జాబితాలో 4.55 కోట్ల ఓటర్లకు చోటిచ్చారు. ఇలా 99 లక్షల మంది ఓటర్లు తగ్గిపోయారు. దేశంలో అత్యధికంగా ఓట్లు పోయిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటని తెలుస్తోంది.  

10 లక్షల ఫారం–6లు  
జూన్‌ 16 నుంచి అక్టోబరు 22 వరకు ఓటర్ల నుంచి 25,87,461 దరఖాస్తులను స్వీకరించామని సీఈఓ తెలిపారు. కొత్త ఓటర్ల నుంచి 10,42,863 ఫారం–6 ద­రఖాస్తులు వచ్చాయన్నారు. తొలగింపుల కోసం ఫారం–7 కింద 2,28,917 దరఖాస్తులు చేరాయన్నారు.

  • మహిళా ఓటర్లే ఎక్కువ  
    నూతన ఓటరు జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,25,40,493 మంది పురుషులు, 2,29,12,355 మంది మహిళా ఓటర్లు ఉ­న్నారు. తృతీయ లింగ ఓటర్లు 2,841 మంది.  

  • సైనికులు, రక్షణ సేవల ఓటర్లు 44,322 మంది. ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,252 మంది ఉన్నారు.  
    18–19 ఏళ్లలోపు యువ ఓటర్లు 6,83,364 మంది.

  •  85 ఏళ్లకు పైబడిన అత్యంత వృద్ధ ఓటర్లు 3,92,134 మందిగా తేలారు  

  • దివ్యాంగ ఓటర్లు 5,65,340 మంది ఉన్నారు.

చెక్‌ చేసుకోండి  
తుది జాబితాలో తమ పేరు ఉందా లేదా అనేది ఓటర్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా పరిశీలించుకోవాలి. పేర్లు లేని అర్హులైన ఓటర్లు స్థానిక అధికారులను సంప్రదించాలి. పేరు చేర్చడానికి ఫారం– 6ను అందజేయాలి. పేరు, అడ్రస్‌ తదితరాల సవరణలకు ఫారం–8 వినియోగించవచ్చు.

ఇదీ చదవండి: భీకర అర్నబ్‌


 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)