Breaking News

పాక్‌ వెళ్లేందుకు ముగిసిన గడువు 

Published on Mon, 04/28/2025 - 04:48

చండీగఢ్‌/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్‌ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. 

అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్‌ రద్దుచేయడం తెల్సిందే. 

దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్‌ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు  కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్‌ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్‌ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. 

ఢిల్లీలో 5,000 మంది  
ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్‌ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్‌ సూద్‌ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్‌ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్‌ సర్కార్‌ తెలిపింది.  

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)