Breaking News

లేడీ కిలాడీలు.. సీసీ ఫుటేజ్‌లో షాకింగ్‌ దృశ్యాలు

Published on Fri, 01/09/2026 - 15:34

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కస్టమర్లుగా నటిస్తూ గోల్డ్‌ షాప్‌కు వెళ్లిన మహిళలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గరు మహిళలు కేవలం 14 నిమిషాల్లోనే రూ.14 లక్షల విలువైన బంగారు చెవి పోగులు దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్‌రాజ్‌లోని కల్యాణ్‌ జువెలర్స్‌ షోరూమ్‌లో డిసెంబర్‌ 31 2025న ఈ ఘటన జరిగింది.

ఆభరణాలు కొనేందుకు కస్టమర్లుగా వెళ్లిన ముగ్గురు మహిళలు.. సేల్స్‌మెన్‌ వారికి బంగారు ఆభరణాలను చూపించడంలో బిజీగా ఉన్న సమయంలో షోకేస్‌లో ఉన్న చెవిపోగుల డిస్‌ప్లే ప్యాడ్‌ను దొంగలించారు. ఎవరికీ కనిపించకుండా దుస్తుల్లో దాచి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కేవలం 14 నిమిషాల్లోనే పనిపూర్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

డిస్‌ప్లే ప్యాడ్‌ కనిపించకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ వ్యవహారం బయటపడింది.  జువెలర్స్‌   సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. సేల్స్‌మన్‌ను దృష్టి మళ్లించి, షాప్‌లో ఆభరణం దాచడం సినిమా సన్నివేశంలా ఉందంటూ ఒకరు.. సెక్యూరిటీ గార్డ్‌తో పాటు, సీసీటీవీని గమనిస్తూ వెంటనే అలర్ట్ చేసే వ్యక్తిని కూడా నియమించాలంటూ మరొకరు సూచనలు ఇస్తున్నారు. మరో నెటిజన్‌  వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. అది కూడా ఒక స్కిల్‌నే, దాంతో సంపాదించనివ్వండి.” అంటూ కామెంట్‌ పెట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)