Breaking News

బారాముల్లాలో ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్రవాదుల హ‌తం

Published on Sat, 09/14/2024 - 13:20

శ్రీన‌గ‌ర్‌: అసెంబ్లీ ఎన్నికల ముందు జమ్ముకశ్మీర్‌లో బాంబు మోత మోగుతోంది. ఇప్పటికే కథువా, కిష్త్వార్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుండగా.. తాజాగా  బారాముల్లా జిల్లాలోనూ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ఎన్‌కౌంటర్‌ ముగ్గురు మిలిటెంట్లు హ‌త‌మ‌య్యారు. ఉత్తర కాశ్మీర్ పట్టాన్ ప్రాంతంలోని చక్ తాపర్ క్రీలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు.  స్కూల్ బిల్డింగ్‌లో దాక్కున్న మిలిటెంట్ల‌తో ఎదురుకాల్పుల‌కు దిగారు. శుక్ర‌వారం రాత్రి ఒక మిలిటెంట్‌ చ‌నిపోగా, శ‌నివారం ఉద‌యం మ‌రో ఇద్ద‌రు హ‌త‌మ‌య్యారు.
చదవండి: మోదీ పర్యటన ముందు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల మోత.. ఇద్దరు జవాన్ల మృతి

ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు చ‌నిపోయిన‌ట్లు క‌శ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్ల‌డించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్ర‌క్రియ‌లో ఉన్న‌ట్లు చెప్పారు. మ‌రోవైపు జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్ర‌ధాని మోదీ ప్ర‌చారం చేప‌ట్ట‌నున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)