Breaking News

వంద గుంజీలు.. చిన్నారి మృతి

Published on Mon, 11/17/2025 - 12:41

పాల్ఘర్‌: మహారాష్ట్రలోని పాల్ఘర్‌ పరిధిలో గల వాసాయిలో జరిగిన ఒక ఘటన పలువురిలో ఆందోళనను నింపింది. పాఠశాలకు కొద్ది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందనే నెపంతో 12 ఏళ్ల ఆరో తరగతి విద్యార్థిని కాజల్ గోండ్‌కు ఉపాధ్యాయుడు కఠినమైన శిక్ష విధించారు. 
భుజాలపై స్కూల్ బ్యాగు ఉంచుకుని, ఏకబిగిన వంద గుంజీలు తీయాలంటూ ఆదేశించాడు.

పాఠశాల తరగతులు ముగిసి, ఇంటికి చేరుకున్న కాజల్‌ తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. వెంటనే తల్లిదండ్రులు ఆ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యుల సూచనమేరకు  ఆ చిన్నారిని ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. కాజల్ తల్లి షీలా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..ఉపాధ్యాయులు విధించిన శిక్ష  కారణంగా కాజల్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పింది. తనలాగే మరికొందరు పిల్లలు కూడా 50 నుండి 100 గుంజీలు తీసినట్లు కాజల్‌ తెలిపింది. రెండుమూడు నిమిషాల ఆలస్యం అయిన కారణంగా టీచర్ తమ కూతురికి కఠిన శిక్ష విధించారని, అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు పెరిగాయని ఆ తల్లి కన్నీటితో మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సంఘటనపై ముంబైలోని సర్ జెజె మార్గ్ పోలీస్ స్టేషన్‌లో తొలుత ప్రమాదవశాత్తూ సంభవించిన మృతిగా (Accidental Death) కేసు నమోదైంది. తరువాత ఈ కేసు వాలివ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ  అయ్యింది. పాఠశాలలో విధించిన అమానుష శిక్ష కారణంగానే తమ కుమార్తె మరణించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జేజే ఆస్పత్రి వైద్యులు కాజల్ కుటుంబ సభ్యులకు తెలిపిన వివరాల ప్రకారం.. కాజల్‌కు ఆస్తమా సమస్య ఉంది. ఇలాంటి పరిస్థితిలో, అదనపు బరువున్న బ్యాగును మోస్తూ, అధిక సంఖ్యలో గుంజీలు తీసిన కారణంగా ఆమె అంతర్గత రక్తస్రావానికి గురైంది. అది  ఆ చిన్నారి మరణానికి దారితీసింది. పాఠశాలల్లో పిల్లలపై కఠిన శిక్షలు విధించడానికి ఉదాహరణగా నిలిచిన  ఈ ఘటన మరోసారి కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: పెళ్లి బృందంపై కారు విధ్వంసం.. నలుగురు మృతి

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)