Breaking News

నా భర్తతో హోటల్‌ రూమ్‌లో ఆ హీరోయిన్‌.. అందుకే విడాకులు: శ్రీదేవి

Published on Sun, 06/16/2024 - 08:06

రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ రెండో కుమారుడు యువ రాజ్‌కుమార్‌, భార్య శ్రీదేవి భైరప్ప మధ్య విడాకుల గొడవ కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసింది. భార్య శ్రీదేవితో విడిపోవడానికి జూన్ 6న ఫ్యామిలీ కోర్టులో   విడాకుల పిటిషన్‌ను యువ రాజ్‌కుమార్‌ దాఖలు చేశాడు. దానిని ఖండించిన శ్రీదేవి  తన భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 

తన భర్తకు కన్నడ హీరోయిన్‌ సప్తమిగౌడతో ఎఫైర్‌ ఉందని ఆరోపించింది. ఇదే సమయంలో యువ రాజ్‌కుమార్‌ లాయర్‌ కూడా శ్రీదేవిపై తీవ్రమైన ఆరోపణలే చేశాడు. మరోక వ్యక్తితో శ్రీదేవికి సంబంధం ఉందని, ఆస్తి కోసమే ఇలాంటి చెత్త పనులు చేస్తుందని ఆయన తెలిపాడు.

కోర్టును ఆశ్రయించిన సప్తమిగౌడ
శ్రీదేవిపై కాంతార నటి సప్తమిగౌడ కోర్టును ఆశ్రయించింది. యువరాజ్‌కుమార్‌ కేసులో తన పేరు ప్రస్తావిస్తూ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ సప్తమిగౌడ బెంగళూరు సిటీ సివిల్‌కోర్టులో కేసు వేసింది. దీంతో ఆమె పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయరాదని జడ్జి ఆదేశాలిచ్చారు. శ్రీదేవికి కూడా నోటీసులు జారీ చేశారు. యువ రాజ్‌కుమార్‌ కాపురంలో కలతలకు నటి సప్తమిగౌడ కారణమని శ్రీదేవి ఆరోపిస్తోంది. 

'యువ' సినిమాలో సప్తమిగౌడతో యువ రాజ్‌కుమార్‌ కలిసి నటించారు. ఈ సినిమా 2024 మార్చి ఆఖరులో విడుదలై మిశ్రమ ఫలితాల్ని చవిచూసింది. కానీ భారీగా వసూళ్లను రాబట్టింది. యువ రాజ్‌కుమార్‌, సప్తమి మధ్య అపైర్‌ ఉందని శ్రీదేవి ఆరోపించింది. ఇద్దరిని హోటల్‌ రూమ్‌లో చూశానని చెబుతోంది. ఇది సప్తమిగౌడకు తీవ్ర ఇబ్బందిగా మారడంతో కోర్టును ఆశ్రయించింది.

దివంగత నటుడు రాజ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు శివ రాజ్‌కుమార్,రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ అనే విషయం తెలిసిందే. వీరిలో రాఘవేంద్ర కుమారుడే యువ రాజ్‌కుమార్‌. అయితే, ఈ వివాదంపై శివ రాజ్‌కుమార్‌ ఎలాంటి కామెంట్‌ చేయలేదు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)