Breaking News

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధుగాడి లవ్ స్టోరీ

Published on Tue, 06/09/2026 - 21:19

మనోజ్ కుమార్, మోహన సిద్ధి, , శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ప్ర‌సాద్ ల్యాబ్‌లోజ‌రిగిన ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..'పవన్ కల్యాణ్ డైలాగ్‌లో వచ్చిన సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నా. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెర‌కెక్కించిన దర్శకుడు రమేశ్‌ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అన్నారు.

తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేశ్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా' అన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..'కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)