Breaking News

అతను లేకపోతే మ్యాడ్‌ స్క్వేర్‌ హిట్‌ అయ్యేది కాదేమో?: జూనియర్ ఎన్టీఆర్‌

Published on Fri, 04/04/2025 - 21:30

మ్యాడ్‌ స్క్వేర్‌ మూవీతో మరో సూపర్ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ కల్యాణ్ శంకర్. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌ నిర్వహించింది. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య ‍అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యాట్ టీమ్‌ను ఉద్దేశించిన ఎన్టీఆర్ మాట్లాడారు. మ్యాడ్‌ స్క్వేర్‌ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు .

జూనియర్ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..' నవ్వించడం అనేది ఒక పెద్ద వరం. అలా మనల్ని ఎప్పుడు నవ్వించడానికి మనకు కల్యాణ్ శంకర్ దొరికాడు. దర్శకుడికి నచ్చినట్లుగా మీరు చేయడం కూడా గొప్ప వరం. ఈ సినిమాలో లడ్డు(విష్ణు) లేకపోతే హిట్‌ అయ్యేది కాదేమో. అతను ఇన్నోసెంట్‌ అని నేను అనుకోవట్లేదు. కానీ సినిమాలో అలా చేశాడు. సంగీత్‌ శోభన్‌ను చూసి ఆయన కుటుంబం అంతా గర్వపడుతున్నారు. రామ్ నితిన్‌.. నేను ఎలా ఉండేవాన్నో అలానే ఉన్నారు. కెమెరా ముందు నిలబడటం అంతా ఈజీ కాదు. కామెడీని పండించడం చాలా కష్టమైన పని. రామ్ నితిన్ నీకు మంచి భవిష్యత్తు ఉంది' అని అన్నారు.

బామర్ది నార్నే నితిన్ గురించి మాట్లాడుతూ..'2011లో నాకు పెళ్లైంది. అప్పుడు నార్నే నితిన్ చిన్న పిల్లవాడు. మొదట నాతో మాట్లాడేవాడు కాదు. వీడు ధైర్యం చేసి మొట్టమొదటిసారి చెప్పిన మాట బావ నేను యాక్టర్ అవుతానని. అంతే ధైర్యంగా నీ సావు నువ్వు చావు.. నా సపోర్ట్ అయితే నీకు ఉండదు అని చెప్పా. ఆ తర్వాత అతని కెరీర్‌పై నాకు భయం ఉండేది. నాకు ఏమి చెప్పొద్దు అనేవాడిని. ఏరోజు నన్ను ఏది అడగలేదు. ఈ రోజు తనను చూసి చాలా గర్వంగా ఉంది. మంచి దర్శకులు, నిర్మాతలతో పనిచేశాడు. కచ్చితంగా వారిని గుర్తు పెట్టుకో. నిన్ను నువ్వు నమ్ముకో. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంటికెళ్లాక మరోసారి నీతో మాట్లాడతా.' అంటూ సరదాగా మాట్లాడారు.

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు