'అభిమాని అంత్యక్రియలు.. నేనలా చేయడం కరెక్ట్ కాదు'

Published on Fri, 08/14/2026 - 17:53

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్- ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా అనిపించింది. ఈ యాక్షన్‌ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.

టాక్సిక్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఓ అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. తాను వెళ్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అందుకే తన అభిమాని అంత్యక్రియలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అతని మరణం నన్ను బాధించిందని.. కానీ నేను వెళ్తే మిగతా అభిమానులు కూడా అదే పని చేస్తారని యశ్ తెలిపారు.

కాగా.. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్యా జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్ అభిమాని రామకృష్ణ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన అంత్యక్రియలకు యశ్, రాజకీయ నాయకుడు సిద్దరామయ్య హాజరు కావాలని కోరుతూ ఒక లేఖను రాశాడు. ఇది చూసి సిద్దరామయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ యశ్ హాజరు కాలేదు. తాజాగా తాను అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే.. మిగతా ఫ్యాన్స్‌ కూడా అలానే చేస్తారని.. ఆ ఆలోచనా విధానమే తప్పని యశ్ స్పష్టం చేశారు.

 

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)