Breaking News

స్టార్ హీరో ఇంట్లోకి ప్రవేశించిన మహిళ.. చివరికి ఏమైందంటే?

Published on Tue, 05/27/2025 - 16:21

బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్‌ కపూర్‌ ఇంట్లో గుర్తు తెలియని మహిళ ప్రవేశించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  హీరో ఇంటికి వచ్చిన ఆమె పనిమనిషితో ఆదిత్య రాయ్‌ కపూర్‌ను కలిసేందుకు వచ్చానని తెలిపింది. ఆయన కోసం బహుమతులు కూడా తీసుకొచ్చానని చెప్పింది. దీంతో ఆమెను ఇంట్లోకి అనుమతించారు. కానీ ఆ సమయంలో ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేరని సమాచారం.

ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంట్లోకి మహిళ వచ్చిన విషయాన్ని ఆ తర్వాత హీరోకు సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆదిత్య రాయ్ కపూర్ వెంటనే హౌసింగ్‌ సొసైటీ అధికారులను సంప్రదించగా.. వారు ఖర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు  47 ఏళ్ల గజాలా సిద్ధిక్ అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

అయితే ఈ కేసు దర్యాప్తులో ఇది సిద్ధిక్‌కు ఇలా చేయడం మొదటి సారి కాదని తెలిసింది. గత వారంలో ఆమె సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. దుబాయ్ నివాసిగా చెప్పుకునే గజాలా సిద్ధిక్.. ఆదిత్య రాయ్ కపూర్‌ను కలవడానికి ముంబైకి వచ్చానని పోలీసులతో చెప్పారు. దీంతో కేసు నమోదు చేసిన బాలీవుడ్ ప్రముఖులను సంప్రదించడానికి ఆమె పదే పదే ప్రయత్నించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)