Breaking News

తెలుగు స్టార్ హీరోలు.. ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

Published on Fri, 12/12/2025 - 17:29

రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ కనిపిస్తుంది. ఎంతలా అంటే తెలుగు హీరోలు ఎవరినీ వదట్లేదు. అసభ్యకర కామెంట్స్ కావొచ్చు, దారుణమైన ట్రోల్స్ చేయడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ తదితరులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆంధ్ర, తెలంగాణలోనూ హైకోర్టులు ఉన్నప్పటికీ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? కారణమేంటి?

అయితే వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుని సెలబ్రిటీలు ప్రధానంగా ఎంపిక చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది. ఈ విషయంలో ఇక్కడైతే వీలైనంత త్వరగా ఆదేశాలు వస్తాయి. ఇలాంటి చాలా పిటిషన్లని గతంలో ఇక్కడ విచారించడం కూడా కారణమని చెప్పొచ్చు. అలానే అక్కడ తీర్పు వస్తే దేశవ్యాప్తంగా అందరికీ తెలియడానికి అవకాశముంది.

(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన పవన్ కల్యాణ్)

సోషల్ మీడియాలో ప్రధానంగా ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్స్, కంపెనీలు హెడ్ ఆఫీస్‌లు దాదాపుగా ఢిల్లీలోనే ఉ‍న్నాయి. ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత సమాచారం వాళ్లకు తెలియడం కూడా సులభం అవుతుంది. అలానే వ్యక్తిగత హక్కుల్ని డీల్ చేసే చాలా ఏజెన్సీలు అక్కడే ఉండటం కూడా దీనికి ఓ కారణం. ఇందువల్లే సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుని ఎంచుకుంటున్నారు.

గత కొన్నాళ్లుగా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్.. హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మిగతా పేరున్న నటీనటులు కూడా ఇలానే వ్యక్తిగత హక్కుల రక్షణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి యువత.. ఇకపై సోషల్ మీడియాలో ఏ నటుడు లేదా నటి గురించి ఏదైనా కామెంట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి. లేదంటే కోర్ట్ ఆర్డర్స్ వల్ల కటకటాలపాలయ్యే అవకాశముంది. కాబట్టి బీ కేర్ ఫుల్!

(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)