Breaking News

దురంధర్‌ తెలుగు వర్షన్‌.. రిలీజ్‌ కాకపోవడానికి అదే కారణమా?

Published on Tue, 12/23/2025 - 17:01

డిసెంబర్‌లో వచ్చిన ​‍ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్‌ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ దురంధర్ ఈ ఏడాది ‍‍‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‍అవతరించింది. రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే రూ.872 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఇంత క్రేజ్‌ ఉన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. కేవలం నార్త్‌ ఆడియన్స్‌కే పరిమితమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వీక్షించాలని సౌత్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ దురంధర్ డబ్బింగ్‌ వర్షన్‌ రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అసలు దురంధర్‌ను సౌత్ భాషల్లో  విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు భాషలోనైనా ఈ మూవీని చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దురంధర్ తెలుగు వర్షన్‌ రిలీజవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లో తీసుకొస్తారా? థియేటర్లలో రిలీజ్ చేస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

అదే కారణమా?

అయితే తెలుగులో దురంధర్ రిలీజ్ చేయకపోవడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 19న ఈ మూవీని తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ బ్యాక్‌ ఆధారంగానే తెలుగులో విడుదలపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే హైదరాబాద్‌లోని తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్.  అందుకే డబ్బింగ్‌ వర్షన్‌తో ఈ మూవీ ఒరిజినాలిటీ మిస్సవుతుందని మేకర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఓటీటీలో చూడాల్సిందేనా..?

ఇక సౌత్ భాషల్లో దురంధర్‌ను థియేటర్లలో చూసే ‍అవకాశం కనిపించట్లేదు. కేవలం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాతే తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దురంధర్ రిలీజై మూడోవారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్‌మస్‌, సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. అందువల్ల దురంధర్‌ డబ్బింగ్ వర్షన్‌ ఇక రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలుగులో దురంధర్‌ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)